భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి భారత జూనియర్ హాకీ జట్టు తేరుకుంది. 24 గంటల వ్యవధిలో జరిగిన మరో మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగి ఘన విజయంతో టోర్నీలో బోణీ కొట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 13–1 గోల్స్ తేడాతో కెనడాను చిత్తు చేసింది. భారత్ ఆటగాళ్లలో సంజయ్ (17, 32, 59వ నిమిషాల్లో), అరైజీత్ సింగ్ (40, 50, 51వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ సాధించారు.
ఉత్తమ్ సింగ్ (16, 47వ నిమిషాల్లో), శర్దానంద్ (35, 53వ నిమిషాల్లో)లు రెండు గోల్స్ చొప్పున చేయ గా... కెప్టెన్ వివేక్ సాగర్ ప్రసాద్ (8వ నిమిషంలో), మణీందర్ సింగ్ (27వ నిమిషం లో), అభిషేక్ లాక్రా (55వ నిమిషంలో) తలా ఓ గోల్ చేసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. కెనడా తరఫున నమోదైన ఏకైక గోల్ (30వ నిమిషంలో)ను క్రిస్టోఫర్ చేశాడు.
చదవండి: James Neesham: 'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది'
Comments
Please login to add a commentAdd a comment