ఫైనల్‌కు చేరిన భారత్‌ | Junior Hockey World Cup, India beat Australia | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు చేరిన భారత్‌

Published Fri, Dec 16 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM

ఫైనల్‌కు చేరిన భారత్‌

ఫైనల్‌కు చేరిన భారత్‌

న్యూఢిల్లీ: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ విజయం సాధించింది.

లక్నోలోని మేజర్‌ ద్యాన్‌చంద్‌ హాకీ స్టేడియంలో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ ఇరుజట్లు.. నిర్ణీత సమయంలో 2-2 స్కోరుతో సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్‌లో అనూహ్యంగా రాణించిన భారత్‌ 4-2 గోల్స్ తేడా ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీని ఓడించిన బెల్జియంతో భారత్‌ తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement