సెయింట్ పీటర్స్‌బర్గ్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత బాలిక నథానియా జాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అధికారిక మ్యాచ్ బాల్ క్యారియర్ (ఓఎంబీసీ)గా వ్యవహరించిన తొలి భారత బాలికగా నథానియా చరిత్ర సృష్టించింది. ఫిఫా కప్‌లో భాగంగా శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బ్రెజిల్- కోస్టారికాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌కు నథానియా ‘బాల్‌గర్ల్’గా వ్యవహరించింది. మాజీ చాంపియన్, ఈసారి వరల్డ్‌కప్ టైటిల్ రేసులో ఒకటైన మేటి జట్టు బ్రెజిల్‌ను సగర్వంగా మైదానంలోకి తోడ్కొని వచ్చింది.
తమిళనాడులోని నీలగిరికి చెందిన నథానియా స్వతహాగా ఫుట్‌బాలర్. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోగల రిషి వ్యాలీ స్కూల్ లో ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఫిఫా స్పాన్సర్ కియా మోటార్స్ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో నెగ్గిన నథానియా ఈ గౌరవం దక్కించుకుంది. తనకు దక్కిన గౌరవంపై నథానియా సంతోషం వ్యక్తం చేసింది. ఆమెతో పాటు కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషీ తేజ్ కూడా బాల్‌బాయ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment