
బ్రాసిలియా: ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో పరాజయం పాలై కోట్లాది మంది హృదయాలను గాయపరిచిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘోర అవమానం ఎదురైంది. స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లతో దాడి చేశారు. రాళ్లు విసిరి హంగామా చేశారు.
గత ప్రపంచకప్‌లో జర్మనీ చేతిలో 7-1తో బ్రెజిల్ ఓటమి పాలు కాగా, ఆ గాయం అభిమాలను వేధిస్తుండగానే ఈసారి బెల్జియం చేతిలో బ్రెజిల్‌కు పరాభవం ఎదురైంది. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న బ్రెజిల్ అభిమానలు తమ జట్టుకు గుడ్లతో దాడి చేసి స్వాగతం పలికారు.
ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. దీంతో రాళ్ల దాడి నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment