మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు..! | Lionel Messis Wife Trolled After Argentina Loss | Sakshi
Sakshi News home page

మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు..!

Published Sat, Jun 23 2018 12:35 PM | Last Updated on Sat, Jun 23 2018 2:01 PM

Lionel Messis Wife Trolled After Argentina Loss - Sakshi

నిజ్నీ నొవొగొరొడ్‌: ఫిఫా ప్రపంచకప్‌లో లియనల్‌ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను మట్టికరిపించిన తర్వాత మెస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు...ఇప్పుడు అతని భార్య అంటోనెల్లా రోకుజ్జోను సైతం వదల్లేదు. ఇందుకు కారణం అంటోనెల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేయడమే.

క్రొయేషియాతో మ్యాచ్‌కు ముందు వోమెస్‌పాపి(గోడాడీ) అనే క్యాప్షన్‌ను జోడించిన అంటోనెల్లా తన మూడేళ్ల కుమారుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు హాజరుకాని అంటోనెల్లా.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భర్తకు చీర్స్‌ తెలిపింది. అయితే క్రొయేషియాతో మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోరంగా వైఫల్యం చెందిన క్రమంలో మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు సెటైర్లు గుప్పిస్తున్నారు.  ఆ క్యాప్షన్‌ను ఉద్దేశిస్తూ.. ‘ మీ నాన్న ఒక లూజర్‌’ అని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించగా, త‍్వరలోనే మీ ‘పాపి’(నాన్న) స్వదేశానికి వచ్చేస్తాడులే’ అని మరో నెటిజన్‌ చమత్కరించాడు. ‘టోర్నీ నుంచి నిష్క్రమించడానికి అర్జెంటీనా చాలా దగ్గరలో ఉంది.. మెస్సీ ఇంటిలో కూర్చొని మ్యాచ్‌లు చూడొచ్చు’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇదిలా ఉంచితే, నైజీరియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో మెస్సీ రాణిస్తాడని పలువురు మద్దతుగా నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement