
బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో మోదీ
బ్యూనస్ ఎయిర్స్: జీ–20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ఎయిర్స్ చేరుకున్నారు. నేడు, రేపు జరిగే ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచం ఎదుర్కోనున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలతో కలిసి మోదీ చర్చించనున్నారు. వచ్చే 48 గంటల్లో ఆయన జీ–20 సమ్మిట్‌తోపాటు ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చల్లో మోదీ పాలుపంచుకుంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment