ముచ్చటగా మూడో పేరు..! | third title for vamsi new film | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడో పేరు..!

Published Sat, Sep 19 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

ముచ్చటగా మూడో పేరు..!

ముచ్చటగా మూడో పేరు..!

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ ఈ మధ్య కాలంలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ చూసిన ఇది వంశీ సినిమా అనే స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న  ఈ  డైరెక్టర్ ఇటీవల తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన వంశీ 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు', 'గోపి గోపిక గోదావరి' లాంటి డీసెంట్ హిట్స్ అందించినా.. పూర్తి ఫాంలోకి మాత్రం రాలేకపోయాడు.

చాలా రోజులు క్రితం వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతే వేగంగా ఆ సినిమాను పూర్తి చేశాడు. అయితే సినిమా పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు రిలీజ్కు మాత్రం నోచుకోలేదు. సినిమా విడుదల జాప్యం కావటంతో ఆ సినిమా టైటిల్ను 'మెల్లగా తట్టింది మనసు తలుపు' అంటూ మార్చాడు. టైటిల్ మార్చినా పరిస్థితి మారలేదు. సినిమా రిలీజ్కు మార్గం సుగమం కాలేదు.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వంశీ తన సినిమా టైటిల్ ను మార్చాడు. 'తను మొన్నే వెళ్లిపోయింది', 'మెల్లగా తట్టింది మనసు తలుపు' తరువాత ప్రస్తుతం అదే సినిమాను 'వెన్నెల్లో హాయ్ హాయ్' పేరుతో ప్రమోట్ చేస్తున్నాడు వంశీ. అజ్మల్, నిఖితా నారాయన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డివి సినీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. మరి టైటిల్ ఛేంజ్ తో అయినా వంశీ సినిమా రిలీజ్ వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement