నువ్వు ఇంస్ట్రుమెంట్‌ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్! | Nee Dhaarey Nee Katha Movie Teaser Released Today, Watch Video Inside - Sakshi
Sakshi News home page

నువ్వు ఇంస్ట్రుమెంట్‌ వాయిస్తున్నావా?.. గేదెను గోకుతున్నావా?.. ఆసక్తిగా టీజర్!

Published Wed, Mar 20 2024 6:43 PM | Last Updated on Wed, Mar 20 2024 6:56 PM

Nee Dhaarey Nee Katha Movie Teaser Released Today - Sakshi

ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం నీ దారే నీ కథ. ఈ చిత్రానికి వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా ఉంటూ దర్శకత్వం వహిస్తున్నారు. జేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజేష్ వీర, శైలజ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత తేజేష్ మాట్లాడుతూ.. 'ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అందరూ కొత్త టీం తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా  మీ ముందుకు తీసుకొస్తున్నాం. తర్వాత వచ్చే సినిమాలు కూడా అంతే కొత్తగా ఉంటాయి. మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమీ లేదు. మీడియానే మాకు పెద్ద సపోర్ట్. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నా మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు.

నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. 'సినిమా మీద ఉన్న  ప్యాషన్‌తోనే నిర్మించాం. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. మీడియా, ప్రేక్షకులు మాలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసి సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..'నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ గురించి చదువుకుని వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ని తెలుగు వాళ్లకు నచ్చే విధంగా మార్పులు చేసి చిత్రీకరించాం. ఈ సినిమాతో కథనే ఎంజాయ్ చేయకుండా కథతో పాటు మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆల్బర్టో గురియోలి సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement