మనసు తలుపు తడితే... | Mellaga Tattindi Manasu Talupu Movie oping | Sakshi
Sakshi News home page

మనసు తలుపు తడితే...

Jun 9 2015 12:02 AM | Updated on Sep 3 2017 3:26 AM

మనసు తలుపు తడితే...

మనసు తలుపు తడితే...

వంశీ సినిమా అంటేనే వైవిధ్యానికి చిరునామా. ‘సితార’, ‘అన్వేషణ’ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభకు కొన్ని తార్కాణాలు.

వంశీ సినిమా అంటేనే వైవిధ్యానికి చిరునామా. ‘సితార’, ‘అన్వేషణ’ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభకు కొన్ని తార్కాణాలు. ఇప్పటికీ ఆయన సినిమాల గురించి ఎదురుచూసే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో ‘మెల్లగా తట్టింది మనసు తలుపు’ చిత్రం రానుంది. అజ్మల్, నికితా నారాయణ్ జంటగా డీవీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రచార చిత్ర ఆవిష్కరణలో వంశీ మాట్లాడుతూ -‘‘మధ్యలో ఆగిపోయిన  ‘తను మొన్నే వెళ్లిపోయింది’ చిత్రాన్ని మళ్లీ ప్రారంభించినందుకు నిర్మాత వెంకటేశ్‌గారికి నా థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ -‘‘వంశీ గారి 25వ సినిమా ఇది. తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రేమించే దర్శకుడాయన’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మల్, నికితా నారాయణన్, డి.వెంకటేశ్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: యం.వి.రఘు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement