12 ఏళ్ల అనంతరం.. | Pakistan received first success | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల అనంతరం..

Published Mon, Jan 16 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

Pakistan received first success

మెల్‌బోర్న్‌: సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హఫీజ్‌ (72; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో... ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌పై పాక్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో పాక్‌ నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. 2005 అనంతరం ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా పాక్‌ గెలవడం ఇదే తొలిసారి.

ముందుగా ఆసీస్‌ 48.2 ఓవర్లలో 220 పరుగులు చేసింది. స్మిత్‌ (60; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆమిర్‌కు మూడు, జునైద్‌.. ఇమాద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం పాక్‌ 47.4 ఓవర్లలో 221 పరుగులు చేసి గెలిచింది. షోయబ్‌ మాలిక్‌ (52 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. స్టార్క్, ఫాల్క్‌నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement