క్షతగాత్రులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శ | Kurnool MLA Hafeez Khan Visits Veldurthy Road Accident Victims | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరామర్శ

Published Sun, Feb 14 2021 10:01 PM | Last Updated on Sun, Feb 14 2021 10:06 PM

Kurnool MLA Hafeez Khan Visits Veldurthy Road Accident Victims - Sakshi

సాక్షి, కర్నూలు: వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను కర్నూల్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పవిత్రమైన అజ్మీర్‌ యాత్రకు వెళ్తుండగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 18 మంది ఉన్నారని, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement