కొలంబొ: ముత్తయ్య మురళీధరన్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు( అన్ని ఫార్మాట్లు కలిపి 1374 ) తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా, వన్డేల్లో 534 వికెట్లతో చరిత్రకెక్కిన ఈ లంక స్పిన్ దిగ్గజం మరో దిగ్గజం షేన్ వార్న్‌తో పోటీ పడి వికెట్లు తీశాడు. అయితే అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన మురళీధరన్ బౌలింగ్‌ను 'చక్కర్' అంటూ పిలవడం అప్పట్లో వైరల్‌గా మారింది. ఇలా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్‌లో తన పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.
తాజాగా మురళీధరన్ కొడుకు నరేన్ బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అచ్చం తండ్రి బౌలింగ్ యాక్షన్‌ను దింపిన నరేన్ వీడియో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోనూ స్వయంగా మురళీధరన్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ..'' ఇట్స్ ఫాదర్ అండ్ సన్ టైమ్.. వీడియో క్రెడిట్స్ టూ సన్‌రైజర్స్ '' అంటూ కామెంట్ చేశాడు. ఇక మురళీధరన్ లంక తరపున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అటు టెస్టులతో పాటు వన్డేల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Father and Son Time! Video credits @SunRisers pic.twitter.com/Jv8fYOAZcp
— Muthiah Muralidaran (@Murali_800) July 15, 2021
Comments
Please login to add a commentAdd a comment