
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్‌లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది.
అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు.
మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్‌లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’.
Comments
Please login to add a commentAdd a comment