సినీరచయిత, సింగర్, నటుడు పీయూశ్ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాడు. 7వ తరగతిలోనే తన బంధువొకరు లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు. తుమ్హారీ అక్కత్ క్యా హై పీయూశ్ మిశ్రా అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. ఇదే విషయం గురించి నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'శృంగారం అనేది ఆరోగ్యకరమైన విషయం. కానీ అది అభ్యంతరకరంగా, అయిష్టంగా ఉంటే మాత్రం దాని నుంచి కోలుకోవడానికి జీవితమే సరిపోదు. జీవితాంతం మాయని మచ్చలా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
ఏడవ తరగతిలోనే మహిళా బంధువొకరు నన్ను లైంగికంగా వేధించింది. తనే కాదు, మరికొందరి పేర్లను కూడా నేను గుట్టుచప్పుడుగానే ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో కొందరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకోలేను' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పీయూశ్ మిశ్రా గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, మఖ్బూల్, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. బాల్లిమారన్ అనే మ్యూజిక్ బ్యాండ్‌లో తను పాటలు రాసి వాటిని తనే స్వయంగా ఆలపించాడు.
Comments
Please login to add a commentAdd a comment