చైతన్యపురి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నార్మక్స్ చైర్మన్ జితేందర్‌రెడ్డి తల్లి సరస్వతమ్మ(80) ఆకస్మికంగా మృతిచెందారు.
చిట్యాల/చైతన్యపురి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నార్మక్స్ చైర్మన్ జితేందర్‌రెడ్డి తల్లి సరస్వతమ్మ(80) ఆకస్మికంగా మృతిచెందారు. సరూర్‌నగర్‌లోని సుఖేందర్‌రెడ్డి సోదరుడు మధర్‌డెయిరీ చైర్మన్ జితేందర్‌రెడ్డి ఇంటిలో ఆమె తుదిస్వాస విడిచారు. మృతి వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖు లు, బంధువులు సోమవారం ఉదయం ఆమె పార్థీవశరీరాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. తల్లి చని పోయిన సమయంలో ఆమె రెండవ కుమారుడు జితేందర్‌రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఆమె మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి తీసుకొచ్చారు.జితేందర్‌రెడ్డి సాయంత్రం ఉరుమడ్లకు చేరుకున్న తరువాత అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రముఖుల నివాళి
కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, తెలంగా ణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, వరంగల్ ఎంపీ సీతారాంనాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరుజానారెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎస్పీ ప్రభాకర్‌రావు, డీఈఓ విశ్వనాథరావు, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీం ద్రనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు కర్నెప్రభాక ర్, పూలరవీందర్, మాజీఎమ్మెల్యేలు జూలకంటిరంగారెడ్డి, నర్సింహయ్య,
ఉజ్జని యాదగిరిరావు, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, భువనగిరి, మిర్యాలగూడ, మేడ్చల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నర్రా రాఘవరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎలిమినేటి ఉమామాదవరెడ్డి, గుత్తా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్యనాయక్, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, సుం కరి మల్లేష్‌గౌడ్, తూడి దేవెందర్‌రెడ్డి, గూడురు నారాయణరెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బోందుగుల నర్సింహారెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్య యా దవ్, మోతె సోమిరెడ్డి, మార్కెండేయు లు, రెగట్టె నర్సింహారెడ్డి, రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, శేపూరి రవీందర్, అల్లంపల్లి నర్సింహ, గాదె నిరంజన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గుండగోని వెంకటేశ్వర్లు, గంట్ల దయాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి తది తరులు నివాళులర్పించారు.