సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధిష్టానంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి వదంతులు మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీకి తాను గతంలో ఎంత దూరంలో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే దూరం పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో గుత్తా మంగళవారం మీడియాతో ఇష్టాగో ష్టిగా మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో సహా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కేడర్‌ను కాపాడి పార్టీకి అండగా నిలబడేందుకు తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.
నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కడ అవకాశమిచ్చినా తన కుమారుడు పోటీ చేస్తాడని, అతనిది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అని పేర్కొన్నారు. తన కుమారుడికి పార్టీ టికెట్ అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని గుత్తా వెల్లడించారు. నల్లగొండ, భువనగిరిలో బీసీలకు అవకాశ మిచ్చినా గెలుపు కోసం సహకరిస్తామన్నారు. నల్ల గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినా ఆమె పై పోటీకి తన కుమారుడు అమిత్ సిద్ధంగా ఉన్నా డని చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు.
ఫిర్యాదులు ప్రివిలేజ్ కమిటీకి..
ముఖ్యమంత్రిపై సభ్యులు చేస్తున్న ఫిర్యాదులను ప్రివిలేజీ కమిటీకి పంపిస్తానని గుత్తా వెల్లడించారు. కేటీఆర్ తన నివాసానికి రావడం సాధారణ రాజకీ య ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే శాసన మండలి సమావేశా లను పాత భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయన్నారు. కమ్యూనిస్టుల ఓట్ల శాతం తగ్గి నా ఎంతో కొంత బలం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment