
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిని ఇరానీ కేఫ్‌గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరి స్తూ ఓ చానల్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కఠినచర్యలు తీసుకో వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
సీఎం వ్యాఖ్యలు మొత్తం శాసనమండలి సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ చానల్ వేదికగా పెద్దల సభపై సీఎం మాట్లాడిన తీరు ఎథిక్స్ కమిటీ పరిశీలించాల్సిన రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బ్రోకర్లు, ల్యాండ్ డీలర్లుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. శాసన మండలిలో అనేక మంది నిజాయితీ కలిగిన సభ్యులతో పాటు వివిధ రంగాల్లో సేవలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని పేర్కొ న్నారు. సీఎం వాడిన భాషకు ఎంతో వేదనకు గుర య్యామని, ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సీఎం వ్యా ఖ్యలను పంపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment