telangna
-
ఆదివారం ఆశవర్కర్లకు సెలవు
సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతోపాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టా ర్గెట్లతోపాటు స్పూటమ్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చె ప్పారు. కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు, రూ. 50 లక్షల బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ప్రమోషన్, హెల్త్‌కార్డు లు, ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రతిపాదనలతో ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. రెండోరోజూ ధర్నా.. నచ్చజెప్పిన పోలీసులు అంతకుముందు జీతాల పెంపు సహా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశవర్కర్లు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ చౌరస్తాలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వందలాది మంది ఆశ వర్కర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తు త అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. కావాలంటే డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో నిరసన తెలుపుకోవాలని నచ్చజెప్పారు. దీంతో ఆశవర్కర్లు డీఎంహెచ్ఎస్లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజేశం, మరికొందరు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వ హామీలను వివరించారు. ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ ఆశవర్కర్లు సోమవారం చేపట్టిన నిరసన సందర్భంగా వారితో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. పో లీసులతో తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీంబీ అనే ఆశ వర్కర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మా జీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
చేదెక్కిన రేషన్ చక్కెర!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖలో సబ్సిడీ చక్కెర చేదెక్కింది. అర్హులైన లబ్ధిదారులకు ప్రతీ నెల పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా పట్టింపు కరువైందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులైన ఒక్కో యూనిట్‌కు 35 కిలోల బియ్యంతోపాటు ఒక కిలో చక్కెర తప్పనిసరిగా అందించాలి. కానీ గత కొంతకాలంగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ జరగడం లేదని చెపుతున్నారు. గత సర్కారు హయాం నుంచే చక్కెరను లబ్ధిదారులకు అందించడం నిలిపివేశారని సమాచారం. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక కిలో పంచదారకు బహిరంగ మార్కెట్లో రూ.42 వరకు ధర ఉంది. అదే చౌకధరల దుకాణాల్లో సబ్సిడీతో రూ.13.50 చొప్పున అందించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ ఖర్చు భరిస్తోంది. చక్కెరను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ సేకరించి సరఫరా చేయాలి. కానీ చక్కెర సరఫరా సక్రమంగా జరగక గత కొన్నేళ్లుగా కేవలం రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గతంలో కొందరు డీలర్లు చక్కెర కోసం డీడీలు కట్టినా సరుకు రేషన్ షాపులకు చేరలేదు. దీంతో చాలామంది డీలర్లు చక్కెరను అడగడమే మానేశారు. కట్టిన డబ్బులు రాకపోవడంతో ఆయా డీలర్లు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జిల్లాస్థాయి అధికారులు చొరవ తీసుకుంటున్న చోట్ల మాత్రమే చక్కెర పంపిణీ జరుగుతోందని చెపుతున్నారు.రాష్ట్రంలో చౌకధరల దుకాణాల వివరాలు..మొత్తం రేషన్ షాపులు :17,352రేషన్ కార్డులు : 89,95,931పంపిణీ చేస్తున్న బియ్యం: 1.79 లక్షల మెట్రిక్ టన్నులుఅంత్యోదయ కార్డులు : 5,66,845పంపిణీ చేయాల్సిన చక్కెర: 566 మెట్రిక్ టన్నులుఅక్టోబర్లో చక్కెర కేటాయింపులు: 538 మెట్రిక్ టన్నులుచక్కెర ఇవ్వాలి..రేషన్ షాపుల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ప్రతీ నెల తక్కువ ధరలో వచ్చే చక్కెర కూడా ఇస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. – కుమ్మరి బక్కక్క, మల్లంపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా -
విమోచన దినంపై కాంగ్రెస్ వైఖరేంటి?: బండి సంజయ్
రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ సమైక్యదినం అంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్.శ్రీనివాస్ నగర నాయకులు పాల్గొన్నారు. -
కేటీఆర్.. గోబెల్స్‌గా పేరు మార్చుకో!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు దారుణమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఓటమిని తట్టుకోలేక కేటీఆర్‌కు మతిభ్రమించి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాల్లో గోబెల్స్‌ను కేటీఆర్ మించిపోయారని.. ఆయన పేరును జోసెఫ్ గోబెల్స్‌రావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరోపణలు, అబద్ధాలు కాదు.. ఆధారాలుంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అందించాలని సవాల్ చేశారు. ఆదివారం జలసౌధ నుంచి నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ కుంగుబాటు ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్‌ను వారు ఏమైనా చేయగలరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడంతోనే బరాజ్ కుంగిపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బరాజ్ కుంగిపోగా.. తర్వాత 45 రోజులు వారే అధికారం ఉన్నారు. ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణ లోపాలతోనే కాళేశ్వరం బరాజ్‌లు ఫెయిల్ అయ్యాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బీఆర్ఎస్ హయాంలోనే నివేదిక ఇచి్చంది. 2019లోనే లోపాలు బయటపడినా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను 2019లో ప్రారంభించిన నాటి నుంచే లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులపై 2019 నుంచీ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీతో నీటిపారుదల శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందని విజిలెన్స్ విచారణలో తేలింది కూడా. లోపాలను పట్టించుకోకపోవడం వల్లే క్రమంగా నష్టం పెరిగింది. అసలు మేడిగడ్డ వద్ద బరాజ్ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తితే దానికి కేసీఆర్, కేటీఆర్‌లే కారణం. ఐదేళ్లలో 30లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.10,820 కోట్లు కేటాయించాం. ఆయా ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశాం. ఈ ఏడాది నుంచే ఏటా 6లక్షల ఎకరాల చొప్పున.. వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి 15 రోజులకోసారి పురోగతిపై సమీక్ష నిర్వహిస్తా. బీఆర్ఎస్ వాళ్లు చెప్తే కాదు.. రైతుల కోసం.. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసింది. అంటే సగటున ఏటా 13 టీఎంసీలే తరలించింది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. రైతుల కోసం మేం పంపింగ్ ప్రారంభించాం. బీఆర్ఎస్ వాళ్లు చెబితేనే చేశామనడం సరికాదు. ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నిల్వ చేస్తే.. అవి తెగిపోయి దిగువన భదాచలం పట్టణం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బరాజ్‌లు, 44 గ్రామాలు నీటిమునిగి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. వాటి నుంచి నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లిఫ్టింగ్ చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా జలాశయాలను నింపి రైతులకు నీళ్లను అందిస్తాం’’అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలివ్వలేవు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయలేవని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదులపై నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు కల్పించిందన్నారు. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావును అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం, తెల్లం ఆ తర్వాత తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని పిటిషనర్ కోర్టు దష్టికి తెచ్చారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. స్పీకర్‌ను కలవాలని ప్రయతి్నంచినా సమయం ఇవ్వట్లేదని.. ఈ–మెయిల్ ద్వారా పంపిన పిటిషన్‌పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని వివేకానంద విజ్ఞప్తి చేశారు.ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని.. ఆయన్ను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. దీనిపై ఏజీ వాదిస్తూ పిటిషన్లు సమరి్పంచిన వెంటనే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదని పిటిషనర్లు పేర్కొనడం సరికాదన్నారు.ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే త్వరగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ సందర్భంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేవంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్‌రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్‌ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్‌తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్‌టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్‌ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
అప్పులున్నా.. ఆర్థిక భారమైనా ఉద్యోగాలిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వానికి అప్పులు ఉన్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా.. వాళ్ల కుటుంబానికి ఉద్యోగాలు గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంలా వాళ్ల ఉద్యోగాలను తొలగించారని రేవంత్‌రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ అదానీని తిడితే, రేవంత్‌రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్ నిలదీశారు. ఈసారి కూడా మెదక్ మనదే ... మెదక్ లోక్‌సభ సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్‌రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే మెదక్ పార్లమెంట్ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్‌కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అవార్డ్ జారీకి శ్రీకారం: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్ జారీచేసే కసరత్తుకు ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్‌మాల పరియోజన తదుపరి ఫేజ్‌లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్హెచ్ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్ నో టిఫికేషన్ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్హెచ్ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు. -
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
భారీ పెట్టుబడులే లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం దావోస్ పర్యటనకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. ఇందులో నోవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆ్రస్టాజనిక్, గూగుల్, ఉబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఉన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులు, సీఐఐ, నాస్కాం వంటి చాంబర్స్ ప్రతినిధులతోనూ రాష్ట్ర బృందం సమావేశం కానుంది. దావోస్ పర్యటనలో భాగంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహారశుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం బృందం సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏఐపై శ్రీధర్‌బాబు ప్రసంగం: కృత్రిమ మేధ (ఏఐ) పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో ‘‘డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ’’అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్ర బృందం కలవనున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు. తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ కేర్– లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలోని ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండ్రస్టియల్ రెవెల్యూషన్ (సీ4ఐఆర్)’సదస్సు హైదరాబాద్‌లో జరగబోతోందని గుర్తు చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ బలాబలాలను, ప్రాధాన్యతలను చాటనున్నట్టు వివరించారు. ఫోరం చర్చల్లో మాట్లాడనున్న రేవంత్ తొలిసారి దావోస్ పర్యటనలోనే సీఎం రేవంత్‌రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మాట్లాడే అవకాశం దక్కింది. అక్కడ జరిగే చర్చాగోష్టిలో.. పురోగమిస్తున్న వైద్యరంగంపై రేవంత్ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ‘‘ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్’’అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని ‘అగ్రి–ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం–రైతుల జీవనోపాధి పరిరక్షణలో భాగంగా వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల’పై సీఎం ప్రసంగించనున్నారు. -
కాంగ్రెస్‌కు క్రెడిట్ దక్కుతుందనే అక్కసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతోనే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పక్కన బెట్టిందని, ఈ విషయంలో తెలంగాణ సమాజం కేసీఆర్‌ను క్షమించదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం వల్లే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందించలేక పోతున్నామన్నారు. శ్రీరాంసాగర్‌లోని నిల్వలు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కూడా సరిపోవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను రక్షించడం కోసమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో సోదాలు చేయించామన్నారు. వేసవిలో రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం ఆల్మట్టి నుంచి 10 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలుస్తామని తెలిపారు. డిసెంబర్‌లోగా ఆ 18 ప్రాజెక్టులు పూర్తి తక్కువ నిధులతో తక్కువ వ్యవధిలో సాగునీరు అందించే ప్రాజెక్టులపై దృష్టి సారించినట్టు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 75 శాతం పూర్తైన 18 ప్రాజెక్టులను వచ్చే జూన్, డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది చివరిలోగా 4.5 లక్షల నుంచి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై అడ్డదిడ్డంగా, వృ«థాగా నిధులు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. రూ.10 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని ప్రకటించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద 60 శాతం నిధులు అందించడానికి కేంద్రం సమ్మతి తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు. చెరువులను సిద్ధం చేయాలి వచ్చే ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు కింద ఎంత కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు అనే అంశంపై నివేదిక సమరి్పంచాల్సిందిగా అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మంథని నియోజకవర్గానికి నీరందించే పనులను సత్వరంగా పూర్తి చేయాలని కోరారు. వచ్చే వేసవికల్లా రాష్ట్రంలోని చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన పూడిక, పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేపట్టాలని ఆదేశించారు. అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా మరమ్మతులు నిర్వహించాలన్నారు. కోయినా నుంచి 100 టీఎంసీలు అడుగుతాం మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేసి 100 టీఎంసీల జలాలను అక్కడి ప్రభుత్వం సముద్రం పాలు చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఆ 100 టీఎంసీల నీళ్లను తెలంగాణకు కేటాయించాల్సిందిగా కోరనున్నట్టు మంత్రి తెలిపారు. అందుకు ప్రతిఫలంగా ఆ నీళ్లతో జరగనున్న జలవిద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని మహారాష్ట్రకు ఇస్తామంటూ ప్రతిపాదిస్తామన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎమ్మెల్సీలను బ్రోకర్లని అంటారా!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిని ఇరానీ కేఫ్‌గా, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరి స్తూ ఓ చానల్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కఠినచర్యలు తీసుకో వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సీఎం వ్యాఖ్యలు మొత్తం శాసనమండలి సభ్యులను అవమానపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టీవీ చానల్ వేదికగా పెద్దల సభపై సీఎం మాట్లాడిన తీరు ఎథిక్స్ కమిటీ పరిశీలించాల్సిన రీతిలో ఉందని అభిప్రాయపడ్డారు. గౌరవ సభ్యులను బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి బ్రోకర్లు, ల్యాండ్ డీలర్లుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. శాసన మండలిలో అనేక మంది నిజాయితీ కలిగిన సభ్యులతో పాటు వివిధ రంగాల్లో సేవలకు తమ జీవితాలను అంకితం చేసిన వారు ఉన్నారని పేర్కొ న్నారు. సీఎం వాడిన భాషకు ఎంతో వేదనకు గుర య్యామని, ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సీఎం వ్యా ఖ్యలను పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్‌లో ఏర్పాటు చేసే క్లస్టర్కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్–ఇన్–ఎయిడ్‌గా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్లస్టర్‌కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐటీఐఆర్, ఎల్రక్టానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఐటీఐఆర్‌పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది. 2013 నవంబర్ 13న ఐటీఐఆర్ క్లస్టర్‌ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్‌లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్‌పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. 2017లో ఐటీఐఆర్ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్‌లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్‌లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్‌తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది. -
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లిస్టు ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది. ►విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేత విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు. ►పురపాలక ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండీఏ, సీడీఎంక కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ►వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవి ►నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్.వి కర్ణన్‌ను నియమించారు. ►ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్ శ్రీనివాసరాజును నియమించారు. ►జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ►జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి ►వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా ►అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ►మహిళ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు. ఇదికూడా చదవండి: నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి?
తెలంగాణ కమలం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది హైదరాబాద్‌లోని గోషామహల్ సీటు ఒక్కటే. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలిచింది. దక్షిణ తెలంగాణలో ఒక్కటి కూడా దక్కలేదు. మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి కాషాయ సేన ఏంచేయబోతోంది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం ఒక్కటే బీజేపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు కూడా కాషాయ పార్టీ దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్‌తో పాటు.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని కమలం పార్టీ భావించింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. నిర్మల్‌లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా మిగిలినవారంతా కొత్తవారే. మొత్తం మీద అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు తగ్గలేదని కమలం పార్టీ నాయకులు సంతోషంగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుని గులాబీ పార్టీని దెబ్బతీశామని భావించిన బీజేపీకి..అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గతంలో గెలిచిన గోషామహల్ ఒక్కటే మిగిలింది. కార్పొరేటర్లను భారీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కమలం పార్టీ జెండా ఎగరేయలేకపోయింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచిన చోట కూడా అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇక మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా బీజేపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. మరో ఐదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వెంటనే దక్షిణ తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టిగా దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగుతో పాటుగా.. కనీసం మరో నాలుగైనా గెలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎంపీ సీట్లు కాపాడుకుంటూ.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాగా వేయాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు. -
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ప్రధాని మంత్రి నరేద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తాడని తాను హామీ ఇస్తున్నానని’ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula — Narendra Modi (@narendramodi) December 7, 2023 ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. -
పదోతరగతి పేపర్ లీక్ కేసుపై నేడు తీర్పు
-
టీ హబ్ 2.O ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్ 2ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది. ఇందులో రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునే వీలుంది. టీ హబ్ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి. చేయూత టీ హబ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత్ లో స్టార్టప్ ఏకో సిస్టం కి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్టార్టప్ పాలసీ కార్పొరేట్‌కి, ఎంటర్ప్రెన్యూర్ లకి సహాయపడేలా ఈ టీ హబ్‌కి రూపకల్పన చేశామన్నారు. కలిసి పనిచేస్తూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవాలని సూచించారు. రోల్ మోడల్ దేశంలో టీ- హబ్ రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఫేజ్ వన్‌లో నిర్మించిన టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని సీఎం తెలిపారు. టీ హబ్ 2 రాకతో టాప్ టెన్ గ్లోబల్ సిస్టం లో తెలంగాణ ఉందని సీఎం వెల్లడించారు. ఆటోమొటివ్, ఫార్మా, అగ్రి, డిఫెన్స్ సిస్టం లలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీఆర్‌కి అభినందనలు తెలంగాణ లో ఐటీ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఐటీ మినిష్టర్ కేటీఆర్ కి నా అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇకపై విద్యాశాఖని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. ఇందుకోసం తమ వంతు సహాకారం అందివ్వాలని ఐటీ ప్రతినిధులను ఆయన కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T-Hub 2.0 Hyderabad: అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్పై రతన్ టాటా స్పందన -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైకి చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 16లక్షల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని, ముంబై గ్యాంగ్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఒక విదేశీయుడు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చారని, అయితే స్పెషల్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. రూ. 16లక్షల కొకైన్, ఎండీఎం,ఎల్ఎస్డీ బోల్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కీలకమైన నిందితుడు నైజీరియన్ టోనీ పరారీలో ఉన్నాడని తెలిపారు. ముంబై అడ్డాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పలు రాష్ట్రాల్లో ఏజంట్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో గుర్తించామని, వారిలో మార్పు రావటం లేదని తెలిపారు. కొనుగొలు చేసిన ఆరుగురిని గుర్తించామని పేర్కొన్నారు. సెక్షన్ 27 ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. తల్లిదండ్రులతో సంప్రదించి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ కన్జూమర్స్ ఉన్నారుని గుర్తిస్తున్నామని తెలిపారు. -
వెరైటీ క్రైమ్: అనేక చిత్రాలు వెలుగులోకి తెచ్చిన ‘21’
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, భారీ చోరీలు వంటి సంచలనాత్మక నేరాలు నమోదవుతూనే ఉంటాయి. వీటిని నిత్యం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు అంతగా ప్రాచుర్యానికి నోచుకోని వెరైటీ నేరాలు కూడా నమోదవుతూ ఉంటాయి. కొన్ని కేసులను తమ విధుల్లో భాగమనుకుంటూ పోలీసులు ఇష్టంతో చేసినా.. ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ కష్టంగా భావించినా ఈ తరహా కేసుల్నీ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యధికం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది చోటు చేసుకున్న వాటిలో ఈ కోవలోకి వచ్చే కేసుల్లో కొన్ని... తనది పోయిందని మరొకరిది.. సాధారణంగా ఎవరైనా తమ వస్తువు పోతే వీలున్నంత వరకు వెతికి విలువైనది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేని పక్షంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదిలేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మూల సునీల్ కుమార్ తన బ్యాగ్ పోయినందుకు మరోటి చోరీ చేసి చిక్కాడు. ఇతగాడు రైల్లో వస్తూ తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఈ నష్టం పూడ్చుకునేందుకు విజయనగరం నుంచి వచ్చిన శివశంకర్ అనే వ్యక్తిది చోరీ చేశాడు. బాధితుడు రైల్వే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా చిక్కి జైలుకు వెళ్లాడు. నేరం చేస్తుండగా నిద్రొచ్చేసింది.. ఓ టార్గెట్‌ను ఎంచుకుని అక్కడ చోరీ చేయాలని భావించిన దొంగలు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తారు. రెక్కీ తర్వాత ‘పని’లోకి దిగి చడీచప్పుడు కాకుండా పూర్తి చేస్తారు. ఆపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఉడాయించేస్తారు. అయితే చాంద్రాయణగుట్ట పరిధిలోని ఆలయంలో చోరీ చేసిన బాలుడు మాత్రం అందులోనే బజ్జుని చిక్కాడు. ఓ బాలుడు శ్రీశైలం రహదారిపై ఉన్న శ్రీరామాలయంలో చోరీకి వచ్చాడు. అర్థరాత్రి శ్లాబ్ నుంచి మెట్ల మార్గంలో లోపలకు ప్రవేశించాడు. అక్కడి హుండీ, అల్మారా తాళాలు పగులకొట్టి సొత్తును సంచిలో వేసుకున్నాడు. ఇంత వరకు అంతా అతడు అనుకు న్నట్లే జరిగినా... ఈ పనితో అలసిపోయాడో ఏమో అక్కడే నిద్రపోయాడు. ఉదయం వచ్చిన పూజారి బాలుడిని, అతడితో ఉన్న సంచిలో సొత్తును చూసి పోలీసులకు అప్పగించాడు. మూత్రం తెచ్చిన తంటా.. దేవరకొండ బస్తీలో మూత్ర విసర్జన రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ బస్తీకి చెందిన ఓ యువకుడు ఓ రోజు రాత్రి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇతడిని మందలించాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే ఇద్దరి స్నేహితులూ అక్కడకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇది పరస్పర దాడుల వరకు వెళ్లింది. విషయం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరడంతో రెండు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదైంది. కాస్త అడ్వాన్స్ అయ్యాడు.. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచో భార్యలకు భర్తలు, అత్తింటి వారి నుంచి వరకట్న వే«ధింపులు ఎదురైన కేసులు ఎన్నో చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లాకు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి మాత్రం ‘అడ్వాన్స్’ అయిపోయాడు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా కేపీహెచ్‌బీ రెండో ఫేజ్‌కు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఐదెకరాల భూమి, మరో రూ.25 లక్షల విలువైన స్థలం కట్నంగా ఇచ్చేలా ఒప్పందం తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. కర్ణాటకలోని బేలూరులో బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఇతడి మనస్సు పెళ్లికి ముందే మారిపోయింది. అదనంగా ఐదెకరాలు ఇస్తేనే తాళి కడతానంటూ యువతితో పాటు ఆమె తల్లిదండ్రులనూ ఫోన్ ద్వారా వేధిస్తూ బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదుతో చివరకు జైలు గడప తొక్కాడు. భయపడి బాత్రూమ్లో పడేశాడు.. నగదు, సొత్తు చోరీ చేసిన దొంగలు దాన్ని తమతో పట్టుకుపోతారు. ఆనక జల్సాలు, అవసరాలకు ఖర్చు చేసుకుంటారు. అయితే జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రకాష్ ఇంట్లో చోరీ చేసిన క్యాటరింగ్ బాయ్ మాత్రం ఆ మొత్తాన్ని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. దీపావళి సందర్భంగా ప్రకాష్ రూ.3.5 లక్షలు అమ్మవారి ఎదుట ఉంచి పూజించాడు. ఆ ఫంక్షన్‌కు క్యాటరింగ్ బాయ్‌గా వచ్చిన షేక్ చాంద్ రజాక్ ఆ మొత్తాన్ని జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి డబ్బు పోయిన విషయం గుర్తించిన యజమాని తనిఖీలు మొదలెట్టారు. దీంతో తాను చిక్కుతానని భయపడిన రజాక్ బాత్రూమ్లోకి వెళ్లాడు. రూ.75 వేలు జేబులో ఉంచుకుని మిగతా మొత్తం కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేశాడు. జేబులో ఉన్న డబ్బుతోనే చిక్కిన అత గాడు ఆరా తీస్తే అసలు విషయం చెప్పాడు. అదృశ్యాలు తట్టుకోలేక ‘ఆమె’గా మార్చారు.. యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబీకులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్‌డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబీకులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో రెండుమూడుసార్లు ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ట్రాన్స్‌జెండర్స్ గ్రూపుల్లో చేరుతున్నాడు. విషయం గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ డెస్క్‌కు చేరింది. సిద్ధిపేటలో అతడిని గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పరిణామాలకు దారితీసే ఆస్కారం ఉందని గుర్తించారు. తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసి వారి కుమారుడి కోరికను మన్నించేలా చేశారు. రాజీ కోసం చోరీ.. గ్రామీణ ప్రాంతాల్లో చోటు చేసుకున్న కొన్ని నేరాలు పోలీసుల వరకు రావు. పెద్దల సమక్షంలో జరిగే పంచాయితీల్లోనే సెటిల్ అవుతుంటాయి. చోరీ కేసులో ఇలాంటి ఓ సెటిల్మెంట్కు సంబంధించిన సొమ్ము చెల్లించడానికి నగరానికి వచ్చి చోరీ చేసి చిక్కాడో ప్రబుద్ధుడు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ మండలం, సత్యగామకు చెందిన నాగరాజు ఆ గ్రామంలో ఓ చోరీ చేశాడు. పెద్ద మనుషుల సమక్షంలో ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తానంటూ అంగీకరించాడు. ఆ డబ్బుతో పాటు తనకూ కొంత మిగలాలనే ఉద్దేశంతో సిటీకి వచ్చి చోరీ చేయాలని భావించాడు. నగరానికి వచ్చి బంజారాహిల్స్‌లోని ఓ దేవాలయంలో పూజారిగా చేరాడు. అక్కడికి వచ్చిన ఓ బాధితురాలి ఇబ్బందులు తొలగిస్తానని నమ్మబలికాడు. అందుకు అవసరమైన పూజ కోసం బంగారం ఇస్తే పూర్తయిన తర్వాత మరో తు లం కలిపి ఇస్తానంటూ నమ్మించాడు. ఇలా ఆమె నుంచి బంగారం, వెండి తీసుకుని పారి పోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
చార్టర్డ్ ప్లేన్స్‌కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది. దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్వేలు నిర్మించి చార్టర్డ్ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది. వరంగల్ ఒక్కటే అనుకూలం.. నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్‌నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి. వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్ విమానాలకు కొంత డిమాండ్ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. టేకాఫ్.. ల్యాండింగ్ ఒకవైపే.. సాధారణంగా రన్‌వేలకు టేకాఫ్, ల్యాండింగ్ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరోవైపు రెండు రన్‌వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్‌వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్‌వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా రన్‌వేకు అనుమతించాలని కోరారు.