
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి.. ప్రధాని మంత్రి నరేద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తాడని తాను హామీ ఇస్తున్నానని’ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment