ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్ 2ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది. ఇందులో రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునే వీలుంది. టీ హబ్ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి.
చేయూత
టీ హబ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత్ లో స్టార్టప్ ఏకో సిస్టం కి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్టార్టప్ పాలసీ కార్పొరేట్‌కి, ఎంటర్ప్రెన్యూర్ లకి సహాయపడేలా ఈ టీ హబ్‌కి రూపకల్పన చేశామన్నారు. కలిసి పనిచేస్తూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవాలని సూచించారు.
రోల్ మోడల్
దేశంలో టీ- హబ్ రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఫేజ్ వన్‌లో నిర్మించిన టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని సీఎం తెలిపారు. టీ హబ్ 2 రాకతో టాప్ టెన్ గ్లోబల్ సిస్టం లో తెలంగాణ ఉందని సీఎం వెల్లడించారు. ఆటోమొటివ్, ఫార్మా, అగ్రి, డిఫెన్స్ సిస్టం లలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
కేటీఆర్‌కి అభినందనలు
తెలంగాణ లో ఐటీ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఐటీ మినిష్టర్ కేటీఆర్ కి నా అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇకపై విద్యాశాఖని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. ఇందుకోసం తమ వంతు సహాకారం అందివ్వాలని ఐటీ ప్రతినిధులను ఆయన కోరారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: T-Hub 2.0 Hyderabad: అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్‌పై రతన్ టాటా స్పందన
Comments
Please login to add a commentAdd a comment