సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వానికి అప్పులు ఉన్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
ఇంకా ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగుకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా.. వాళ్ల కుటుంబానికి ఉద్యోగాలు గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంలా వాళ్ల ఉద్యోగాలను తొలగించారని రేవంత్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment