న్యూఢిల్లీ: కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. శనివారం జర్మనీలోని హాలె నగరంలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మదన్ లాల్‌పై హుసాముద్దీన్ గెలుపొందాడు. మదన్ లాల్‌కు రజతం దక్కింది. 52 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన మరో బాక్సర్ గౌరవ్ సోలంకి పసిడి పతకం గెలిచాడు.
ఫైనల్లో క్యూబా బాక్సర్ అలెజాండ్రో మెరెన్సియోపై నెగ్గాడు. సెమీస్‌లో ఓడిన అమిత్ ఫంగల్ (49 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు మంగోలియాలో జరుగుతోన్న ఉలాన్‌బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో... పురుషుల విభాగంలో మన్‌దీప్ జాంగ్రా (69 కేజీలు), హిమాన్షు శర్మ (49 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), లవ్లీనా బోర్గోహెయిన్ (69 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment