హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (56 కేజీలు)కు చోటు లభించింది. ఇటీవలే బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జా స్మారక టోర్నీలో ఈ నిజామాబాద్ బాక్సర్ కాంస్య పతకం సాధించాడు. వాస్తవానికి 56 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత గౌరవ్ బిధురిని ఎంపిక చేయాల్సి ఉన్నా అతను గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో హుస్సాముద్దీన్ పేరును ఖరారు చేశారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో వచ్చే నెలలో జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత జట్టును భారత బాక్సింగ్ సమాఖ్య బుధవారం ప్రకటించింది. మహిళల జట్టులో మేరీకోమ్ (48 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సరితా దేవి (60 కేజీలు)లను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment