పండగ సెలవులు సైతం మంజూరు.. టార్గెట్లు రద్దు
వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ వెల్లడి
కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ వద్ద ధర్నాను కొనసాగించిన ఆశ వర్కర్లతో చర్చలు
సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతోపాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టా ర్గెట్లతోపాటు స్పూటమ్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చె ప్పారు.
కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు.
ఫిక్స్‌డ్ వేతనం రూ. 18 వేలు, రూ. 50 లక్షల బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ప్రమోషన్, హెల్త్‌కార్డు లు, ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రతిపాదనలతో ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు.
రెండోరోజూ ధర్నా.. నచ్చజెప్పిన పోలీసులు
అంతకుముందు జీతాల పెంపు సహా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశవర్కర్లు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ చౌరస్తాలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వందలాది మంది ఆశ వర్కర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తు త అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. కావాలంటే డీఎంహెచ్‌ఎస్ ప్రాంగణంలో నిరసన తెలుపుకోవాలని నచ్చజెప్పారు. దీంతో ఆశవర్కర్లు డీఎంహెచ్‌ఎస్‌లో ధర్నా చేపట్టారు.
ఈ నేపథ్యంలో స్పందించిన వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజేశం, మరికొందరు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వ హామీలను వివరించారు.
ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్
ఆశవర్కర్లు సోమవారం చేపట్టిన నిరసన సందర్భంగా వారితో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు.
పో లీసులతో తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీంబీ అనే ఆశ వర్కర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మా జీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment