∙‘అనర్హత’పిటిషన్లపై హైకోర్టులో ఏజీ వాదనలు
తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయలేవని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదులపై నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు కల్పించిందన్నారు. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది.
కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావును అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన కడియం, తెల్లం ఆ తర్వాత తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని పిటిషనర్ కోర్టు దష్టికి తెచ్చారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. స్పీకర్‌ను కలవాలని ప్రయతి్నంచినా సమయం ఇవ్వట్లేదని.. ఈ–మెయిల్ ద్వారా పంపిన పిటిషన్‌పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని వివేకానంద విజ్ఞప్తి చేశారు.
ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని.. ఆయన్ను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. దీనిపై ఏజీ వాదిస్తూ పిటిషన్లు సమరి్పంచిన వెంటనే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదని పిటిషనర్లు పేర్కొనడం సరికాదన్నారు.
ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే త్వరగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ సందర్భంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేవంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment