షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు | AP CM YS Jagan Hyderabad Visit On January 18th To Attend YS Sharmila Son Engagement Ceremony - Sakshi

షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్‌ దంపతులు

Jan 18 2024 3:47 AM | Updated on Jan 19 2024 6:46 AM

AP CM Jagan Visit to Hyderabad on january 18 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్‌ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. 

గండిపేటలో నిశ్చితార్థం
గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ & ప్రిడిక్టివ్‌ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివ‌ర్సిటీ నుంచి ప‌ట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement