Raja reddy
-
పులివెందుల: రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
-
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.పులివెందుల గ్రామ సర్పంచ్గారాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానంపులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.విద్యా ప్రదాతగాదివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్‌లు చూపిన బాటలోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులునేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్‌లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
సీఎం జగన్ ఇంటికి సోదరి షర్మిల
సాక్షి, అమరావతి/కడప అర్బన్/గన్నవరం : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. తన తనయుడు రాజారెడ్డి వివాహానికి విచ్చేయాలని ఆహ్వానపత్రికను అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను మంగళవారం తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షర్మిల.. ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకుని, మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అందరినీ ఆహ్వానిస్తున్నా.. సీఎం రమేష్ కు చెందిన అదే స్పెషల్ ఫ్లైట్‌లో తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలి తదితరులతో కలిసి బుధవారం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు రాజారెడ్డి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్కడికి ముందుగానే ప్యాసింజర్ ఫ్లైట్‌లో చేరుకున్న భర్త అనిల్‌కుమార్‌తో పాటు తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్ జగన్‌కు షర్మిల అందజేశారు. అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఇండియా విమానంలో భర్తతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ సందర్భంగాప్రకటించారు. బీటెక్ రవితో అనిల్‌కుమార్ చర్చలు ప్యాసింజర్ ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్లేందుకు షర్మిల భర్త అనిల్ కుమార్ బుధవారం కడప విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ జమ్మలమడుగు సమన్వయకర్త భూపే‹Ùరెడ్డి తండ్రి దేవగుడి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు)లు కూడా విజయవాడకు వెళ్లేందుకు కడప విమానాశ్రయానికి వచ్చారు. వీరిద్దరితో వీఐపీ లాంజ్‌లో అనిల్‌కుమార్ సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్లైట్ అరగంటపాటు ఆలస్యం కావడంతో బీటెక్ రవి, నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటే.. కడప జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని తనతో అనిల్‌కుమార్ చర్చించినట్లు బీటెక్ రవి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న షర్మిలకు తన తరఫున శుభాకాంక్షలు చెప్పాలని అనిల్‌కుమార్‌కు చెప్పానని బీటెక్ రవి అన్నారు. ఆ తర్వాత ఒకే ఫ్లైట్‌లో అనిల్‌కుమార్, బీటెక్ రవి, నారాయణరెడ్డిలు విజయవాడ చేరుకున్నారు. -
డాడీ హోం రాజారెడ్డి అనుమానాస్పద మృతి
ప్రొద్దుటూరు క్రైం : ఎందరో అనాథలు, అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాడీ హోం వ్యవస్థాపకుడు రాజారెడ్డి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూజాస్కూల్ ప్రాంగణంలో పడి ఉండగా ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన నల్లదిమ్ము రాజారెడ్డి సుమారు 20 ఏళ్ల నుంచి మైలవరంలో డాడీ హోం నిర్వహిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. పెద్దముడియం మండలంలోని పాలూరు గ్రామంలో చర్చి ఫాదర్‌గా కొనసాగుతున్నారు. అనాథ, ఎయిడ్స్ బారిన పిల్లలతోపాటు వృద్ధులకు డాడీ హోంలో ఆశ్రయం కల్పించి వారి పోషణా బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామం సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్, ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వెనుక భాగంలో పూజా కిడ్స్ స్కూళ్లను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. రాజారెడ్డి సోదరుడు శ్రీధర్‌రెడ్డితోపాటు అతని భార్య ప్రసన్నలక్ష్మిలు పూజా స్కూల్లోనే ఉంటూ నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. శనివారం, ఆదివారం పాఠశాలకు సెలవులు రావడంతో పూజా స్కూల్లోని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దీంతో పూజా స్కూల్లో దూరప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, పని మనిషులు మాత్రమే ఉన్నారు. రాత్రి శబ్ధం రావడంతో.. శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పై అంతస్తులో ఉన్న ప్రిన్సిపాల్ జాన్ హుటాహుటిన కిందికి వచ్చాడు. శ్రీధర్‌రెడ్డి గాబరా పడుతూ కనిపించడంతో.. తిరిగి ఆయన పైకెళ్లి తొందరగా కిందికి రావాలని తోటి ఉపాధ్యాయులను పిలిచాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు పీఈటీ రామాంజనీ కిందికి వచ్చారు. వారు వచ్చేసరికి కింద పడిపోయిన రాజారెడ్డికి శ్రీధర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మీప్రసన్న, కుమార్తెలు సపర్యలు చేస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత రాజారెడ్డిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలియడంతో సీఐ ఇబ్రహీంతోపాటు రూరల్ ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజారెడ్డి మృతదేహంపై ఎక్కువ గాయాలు ఉండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వీపు, ముఖం, చేతులకు గాయాలున్నాయి. దీంతో ఆయన మృతిపై బంధువులు, పూజా స్కూల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలను పెంచిన రీ పోస్టుమార్టం పూజా స్కూల్ పీఈటీ రామాంజనీ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం రాజారెడ్డి మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పూజా స్కూల్‌కు తరలించారు. విద్యార్థులు, బంధువుల సందర్శనార్థం కొంత సేపు అక్కడ ఉంచి తర్వాత మైలవరంలోని డాడీ హోంకు మృతదేహాన్ని తరలించాలని భావించారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులకు అనుమానం రావడంతో మరింత లోతుగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని డీఎంహెచ్ఓను కోరారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు కడప నుంచి ప్రొఫెసర్ల బృందాన్ని పంపించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. దీంతో పూజా స్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రొఫెసర్లచే రీ పోస్టుమార్టం చేయించారు. పోస్టుంమార్టం తర్వాత రాజారెడ్డి మృతిపై పోలీసులకు అనుమానాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం మైలవరంలోని డాడీ హోంలో రాజారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాజారెడ్డి మృతితో డాడీహోంలోని అనాథ పిల్లలు బోరున విలపించసాగారు. రాజారెడ్డి తల్లి సుబ్బమ్మ కుమారుని మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించింది. పోలీసు అధికారుల దర్యాప్తు ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు జిల్లా ఆస్పత్రికి చేరుకొని స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతో కూడా పోలీసు అధికారులు చర్చించారు. కాగా ఇటీవల పూజాస్కూల్ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఇరువురు అనాథ బాలికలకు అప్పగించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖుల నివాళులు రాజారెడ్డి మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూజాస్కూల్లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సేవకు మారుపేరుగా నిలిచిన రాజారెడ్డి మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ లోసారి సుధాకర్‌తోపాటు రాజుపాళెం మండలంలోని రాజారెడ్డి బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజా స్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు రాజారెడ్డిని కడసారి చూడటానికి వచ్చారు. -
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
నోరు తెచ్చిన తంటా
ఎండలు మండిపోతున్నాయి. కరువు తాండవం చేస్తోంది. పగలంతా పనికి వెళ్లిన మూడు పూటలూ గడిచేది కష్టం. అందులో పనులు దొరకడం లేదు, కొత్తగా పెళ్ళి చేసుకున్నాను. బోలెడు ఆస్తి వుంది కదాని మామగారు పిలిచి మరీ పిల్లనిచ్చాడు. అమ్ముకోవడానికి తప్ప నమ్ముకొని కాసిన్ని కాయలు తినే అదృష్టం ఎలాగూ లేదు. చిన్నప్పటి స్నేహితుడు రాము బెంగళూరులో పనికి కుదిరి బాగా సంపాదించాడని నాన్న తెగ పొగుడుతుంటేను వాడికి ఫోన్ కలిపాను. ‘‘నేను నిన్ననే ఇల్లు మారాను. ఇంటి ఓనర్ దగ్గరే పని దొరికింది. చాలా మంచివారు. పై పోర్షన్ ఖాళీగా వుంది. మీరు వస్తామంటే మాట్లాడుతాను. నాతో పాటు పని చేసుకుందురు’’ రాము మాటకు నా సంతోషం ఉట్టినెక్కింది. ఆలస్యం దేనికి అనుకొని..గడ్డి చాలక బక్కచిక్కిపోయిన రెండు ఆవులను అమ్మకానికి పెట్టి, కాస్త డబ్బులు అమ్మ నాన్న చేతిలో పెట్టి.. బ్యాగు నిండా బట్టలు సర్ది నేను మా ఆవిడ గోరంట్ల బస్టాండుకు చేరుకున్నాము. బస్సు ఎక్కేముందు.‘‘రేయ్..అక్కడ నీ నోరు అదుపులో పెట్టుకుని బాగా పని చేసుకో. ఎవరితోనూ కలుగజేసుకోకు జాగ్రత్త’’ అంటూ మమ్మల్ని సాగనంపాడు నాన్న. నాకు కాస్త ముక్కు మీద కోపం. బస్సు గోరంట్ల దాటింది. చివరన రెండు సీట్లు మా కోసమే అన్నట్టుగా ఖాళీగా వున్నాయి. బ్యాగ్ పక్కనే పెట్టుకొని కూర్చున్నాము. బస్సు చాలా వేగంగా వెళుతోంది, బాగేపల్లి టౌను చేరేదాక ఎక్కడ ఆపలేదు. బెల్లం ముక్కకు ఈగలు ముసిరినట్టుగా బస్సు చుట్టూ జనాలు ముసురుకున్నారు. డోరు తెరవగానే ఎదురు నీళ్ళకు చేపలు ఎక్కినట్టుగా జోరుగా ఎక్కేశారు జనాలు. ‘‘ బాబు..ఆ బ్యాగ్ కాస్త పక్కన పెట్టండి’’ బాగా ఖరీదైన వస్త్రాలు ధరించిన ఒక పెద్దాయన నా భుజం తట్టి మరీ అన్నాడు, ‘‘ ఎక్కడ పెట్టమంటావ్..నా నెత్తిన పెట్టుకోమంటావా?’’ కాస్త కసిరినట్టుగా అన్నాను. ‘‘అలా ఎందుకు అంటానండీ, కాస్త పక్కకు లాగండి అన్నాను’’ పక్కనున్న కడ్డీని బలంగా పట్టుకుంటు అన్నాడా పెద్దాయన. ‘‘బట్టలు నలిగిపోతాయి అనుకుంటే కార్లో వెళ్ళవచ్చు కదా మా మీద పడడం దేనికి’’ మాట రెట్టించాను. ‘‘వయసులో పెద్దవాళ్ళని కాస్త చూసి మాట్లాడు’’ అతని భార్య కాబోలు.. పట్టుచీర నలిగిపోతుందేమో అని మాటి మాటికి సర్దుకుంటూ తిన్నగా అంది, ‘‘పెద్దవాళ్లు కూడా పిల్లలకు గౌరవం ఇవ్వాలని తెలియదా’’ ‘‘అంటే నాకు గౌరవించడం రాదా!’’ కోపంగా అన్నాడు పెద్దాయన. ‘‘చూడండి..బ్యాగ్ తీయాలనుకుంటే తీయండి లేదా ఊరుకోండి. అంతేగాని పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ’’ పక్కనే వున్న ఒకతను అన్నాడు. గొడవ కాస్త సద్దుమణిగింది. ఐనా నాలో కోపం తగ్గలేదు. ‘‘టికెట్ టికెట్’’ అంటూ కండక్టర్ అందర్ని తోచుకుంటు ముందుకొచ్చాడు. టికెట్ తీసుకున్నాక.. తడబాటులో పెద్దాయన నా కాలు తొక్కాడు. మరింత కోపం వచ్చింది.. నా భార్య వారిస్తున్నా వినలేదు ‘‘కాలు తొక్కుతారెందుకు సరిగ్గా నిలబడలేరా’’ కటువుగా అన్నాను. ‘‘ఈ జనాల్లో ఎక్కడ నిలుచుకోమంటావ్ కాళ్ళు తీసి నెత్తిన పెట్టుకోవాలా’’. పెద్దాయన మాటకు రక్తం ఉడికింది నాకు. ‘‘మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోండి’’ అనేశాను. కొద్దిసేపట్లోనే గొడవ ఎక్కడికో వెళ్లిపోయింది, అక్కడున్న వారంతా నాదే తప్పు అన్నట్టుగా వాదనలు చేసారు. ‘‘బయటికి వచ్చినప్పుడు కొన్నింటిని సర్దుకుపోవాలి. చెబితే వినరు’’ భార్య తిన్నగా సముదాయించింది నన్ను. ‘‘నోరు పారేసుకోవడం పెద్దది కాదండీ. అదుపులో వుంచుకోవడం నేర్చుకోవాలి’’ అంటూ ప్రతి వారి నోళ్ళల్లోను తప్పు నావైపే చూపిస్తూ అనడం మొదలు పెట్టారు. ‘‘ఛీ..ఇలాంటి వారి దగ్గర నిలుచుకోవడం కంటే దూరంగా వుండడమే మంచిది’’ అంటూ పెద్దాయన నా మొహం పైనే అనేసి..అంత రద్దీలో కూడా భార్యతో కలసి లోపలికి వెళ్ళాడు. బస్సు దేవనహళ్ళి దాటుకొని బెంగుళూరులోకి వేగంగా అడుగు పెట్టింది. ఒక్కొక్కరే దిగుతు వస్తున్నారు. బస్సు కాస్త పలచన బడింది. ఏ ఒక్కరో ఇద్దరో తప్ప మిగిలిన వారంతా సీట్లలో కూర్చున్నారు. బస్సు మెయిన్ బస్టాండుకు చేరింది. హడావుడిగా బ్యాగ్ తీసుకుని దిగేసాము. నాతో గొడవ పడిన పెద్దాయన కార్లో లగేజీ సర్దుతూ కనిపించాడు. బాగా వున్నవాళ్ళే అనుకుంటా..తను నా వైపు చూసీ ‘‘బస్సులో మొరిగే కుక్కలు కూడా వస్తాయని తెలుసుంటే కార్లో వచ్చేవాళ్ళం’’ పరోక్షంగా నన్నే అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. నేను నా భార్య కలసి..పదిహేనవ నంబర్ ప్లాట్‌ఫాంలో నిలుచున్నాము. బొమ్మనహళ్ళి వెళ్ళే బస్సు కోసం వేచి చూస్తున్నాము, పది నిమిషాల తర్వాత బస్సు వచ్చి నిలబడగానే లోపల జనాలు క్షణాల్లో కిక్కిరిసి పోయారు. బ్యాగ్ చేతిలో పట్టుకుని నిలుచున్నాము. అక్కడక్కడా నిలిచి స్థానం చేరేపాటికి గంట పైనే పట్టింది. అతి కష్టంగా జనాలను తోచుకుంటూ కిందకి దిగేసాము. మా రాక కోసం రాము బస్టాపులోనే వేచి కూర్చున్నాడు. ఆటో తీసుకుని ముగ్గరం ఇంటికి వెళ్ళేపాటికి చీకటి పడింది. పై పోర్షన్లో రాము వుంటున్నాడు. మా గురించి మొత్తం చెప్పేసాడట. ఉదయాన్నే ఇంటి ఓనర్ని కలిసి పనికి వెళ్ళడమే తరువాయి..ఇంత తొందరగా బెంగుళూరులో పని కుదురుతుందని కలలో కూడా ఊహించలేదు. రాము వుంటున్న పక్క రూంలో ఉదయం చేరిపోవాలి. ఆ రాత్రి పల్లె కబుర్లు తోనే గడిపేసాం. ఉదయం ఆరింటికే లేచి మొహం కడిగినాక..ఇంటి ఓనర్ని కలవడానికి నేను రాము కిందకు వచ్చాము. తలుపులు ఇంకా తీయనేలేదు వాళ్ళు.. కాలింగ్ బెల్ నొక్కగానే ఇంటి ఓనర్ తలుపులు తీశాడు...అంతే.. షాక్... కొట్టినట్టు అదిరిపోయి నిలబడిపోయాను. నిన్న బస్సులో గొడవపడ్డ పెద్దాయన నన్ను చూడగానే నిప్పులు చెరిగినట్టు గుడ్లురిమి చూసాడు. ‘‘నువ్వు చెప్పింది ఇతనేనా..’’ ఆ స్వరంలో గాఢత వినిపించింది. అవును అన్నట్టు తలూపాడు రాము. ‘‘తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి’’ అన్నాడు రాము వైపు చూసి, స్పీడుగా లోపలికి వెళ్ళి అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు తెచ్చి విసిరి ముఖానికి కొట్టి..బస్సులో జరిగిన విషయమంతా కక్కేసాడు పెద్దాయన.. ‘‘నేను కావాలంటే వెళ్ళిపోతాను. రామును వుండనివ్వండి’’ అన్నాను. ‘‘ విత్తు ఒకటి చెట్టు ఒకటి వుండదు. ఇద్దరూ ఖాళీ చేయండి. చేయకపోతే నేనే చేయిస్తాను’’ అనేసి మొహంపైనే డోరు వేసేశాడు పెద్దాయన. నా నోరు తెచ్చిన తంటాకు నాతో పాటు రాము కూడా రోడ్డున పడ్డాడు. మా నాన్న అంటుండేవాడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. పెద్దల మాట పెడ చెవిన పెట్టినందుకు బజారున పడాల్సి వచ్చింది నాకు. – నరెద్దుల రాజారెడ్డి గోరంట్ల, అనంతపురం జిల్లా -
‘సీఎం కేసీఆర్ చెప్పేవి అబద్ధాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చెప్పే మాటలు అబద్ధాలని జేఏసీ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ నేత ఆశప్ప అధ్యక్షత వహించగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడిపాపాయ్య మాదిగ, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఝాన్సీ, సంధ్య, విమల, విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. చొచ్చుకొచ్చిన టీఆర్ఎస్వీ నేతల అరెస్ట్ బహిరంగ సభ జరుగుతుండగా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్వీ విద్యార్థి నేతలు వేదిక వద్దకు చొచ్చుకొచ్చారు. సభలో ఉన్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్వీ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు టీఆర్ఎస్వీ నేతలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. -
అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి..
అపరిచితురాలైన వియత్నామీ అమ్మాయిని ‘చితేన్ లాజీ?’ అని అడిగితే అపార్థాలైపోతాయి. ‘మీ పేరేమిటండీ’ అని ఈ మాటకు అర్థం. కావాలంటే అపరిచితురాలైన అబ్బాయిని ‘మీ పేరేమిటండీ? అని అడగొచ్చు. ఏమని అడగాలి వియత్నామీ భాషలో? ఆచార్య రాజారెడ్డిని అడగండి. ఇవనే కాదు, వియత్నాం భాష గురించి ఆయన ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు. వియత్నాంలో మోటార్ బైక్‌లు ఎక్కువ. మన దగ్గరలా రోడ్లనిండా కార్లు కనిపించవు. ఎటు చూసినా బైకులే. అక్కడి మహిళలు కూడా బైక్‌ల మీదే బయటి పనులు చక్కబెట్టేస్తుంటారు. ఇక వియత్నామీలు ఇష్టంగా తినే నూడుల్ సూప్ ‘ఫో’ ఆ దేశపు జాతీయ ఆహారం అనే అనుకోవాలి. ‘ఫో’ను వండని, ‘ఫో’ ఉండని హోటళ్లు, రెస్టారెంట్లు ఉండనే ఉండవు. కాఫీ ఘుమఘుమలు ఏ వేళనైనా దేశమంతటా వ్యాపించి ఉంటాయి. బ్రెజిల్ తర్వాత కాఫీ ఎక్కువగా పండే దేశం కూడా ఇదే. ‘ఎగ్ కాఫీ’ వియత్నాం స్పెషల్. పర్యాటక కేంద్రాలైతే ఎంత రమణీయంగా ఉంటాయో పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. ఆ కల్చర్, కట్టడాలు, ప్యారడైజ్ బీచ్‌లు ఆ దేశానికే ప్రత్యేకం. రెండు రోజుల క్రితమే ఇండియా టూరిజం వియత్నాం టూరిజంతో ‘టైఅప్’ అయింది కూడా. వియత్నామీ భాష, సంస్కృతులపై ఆచార్య రాజారెడ్డి ప్రసంగం (ఫైల్ ఫొటో) అయితే వీటన్నిటికన్నా విలక్షణమైనది వియత్నామీ భాష. ‘‘విలక్షణమైనదే కాదు, మధురమైనది కూడా’’ అంటారు ఆచార్య కోనాపల్లి రాజారెడ్డి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఫసిఫిక్’ విభాగానికి ఆయన ముఖ్య సలహాదారు. ఆయనకేమిటి వియత్నాంతో సంబంధం? సంబంధం కాదు. బంధం. భారతదేశంలో వియత్నాం భాష మీద పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి రాజారెడ్డి! భారత ఆర్మీ అధికారులు వియత్నాంకు వెళ్లే ముందు ఎస్వీయూకు వచ్చి రాజారెడ్డి దగ్గర వియత్నాం భాషలో శిక్షణ పొందారంటే చూడండి. ఎస్వీయూలో చాలామంది బోధన బోధనేతర సిబ్బందికి కూడా ఆయన పెద్దన్నయ్య. రాజారెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళెం సమీపంలోని కోటూరుగ్రామంలో జన్మించారు. బంగారుపాళెంలో చదివారు. చిత్తూరులో బి.ఏ. డిగ్రీ. తర్వాత ఎస్వీయూ నుంచి హిస్టరీలో ఎం.ఏ. పట్టా. ఆ తర్వాత ఆచార్య వి.యం.రెడ్డి పర్యవేక్షణలో వియత్నాం భాషలో పరిశోధన. ఈ పరిశోధన కోసం వియత్నాంలో ఆయన చాలాకాలం గడిపారు. ఫ్రెంచ్ డిప్లొమాను, వియత్నమీజ్ లాంగ్వేజ్ డిప్లొమాలను కూడా పొందారు. వియత్నాంలో పరిశోధన చేస్తున్న రోజుల్లోనే ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ప్రత్యేక మినహాయింపుతో ఎస్వీయూలో అధ్యాపకుడిగా చేరారు. ఎస్వీయూ ఇండోచైనా విభాగంలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆచార్యులుగా, సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియా అండ్ పసిఫిక్ డైరెక్టరుగా, పాఠ్య ప్రణాళికా సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. భారత విదేశాంగ విధానం, వియత్నాం ఆధ్యయనం వంటి ప్రత్యేకాంశాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. వియత్నాంలో జరిగిన కొన్ని సమావేశాలకు భారత ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. రాజారెడ్డి వల్ల ఎస్వీయూలోని ఆయన స్నేహితులైన అధ్యాపకులకు కాస్త వియత్నాం భాషతో పరిచయం ఏర్పడింది. మో...తాయ్...బా... అంటే ఒకటి...రెండు...మూడు. శతబ్ అంటే సైకిల్. అంగ్ తేన్ లాజీ అంటే మగవారిని మీ పేరేమి అని అడగడం... చితేన్ లాజీ అంటే ఆడవారిని మీ పేరేమి? అని అడగడం. ఇలాంటి చిన్న చిన్న పదాలను, వాక్యాలను ఆయన స్నేహితులు సరదాగా వల్లె వేస్తుంటారు. సెప్టెంబర్ 2 వియత్నాం నేషనల్ డే. ఆ దేశ స్వాతంత్య్ర దినం. ఆ సందర్భంగానే సంస్కృత ప్రాకృత భాషల రంగరింపుతో తీపెక్కిన వియత్నామీ భాష గురించీ, ఆ భాషాఫలాలను తెలుగులో నేల సాగు చేస్తున్న రాజిరెడ్డి గురించీ. – ఆచార్య పేటశ్రీ -
కౌసల్యజ
అచ్చుగుద్దినట్లు పోలికలొస్తే..‘నోట్లోంచి ఊడిపడింది’ అంటారు!అలాగైతే.. ఈ అమ్మాయి.. భావనను‘నడకల్లోంచి ఊడిపడింది’ అనాలి.అమ్మ నేర్పిన నడకలు... అమ్మను చూసి నేర్చుకున్న నడకలు!కూచిపూడిలో గొప్ప డాన్సర్... భావన. అంతకన్నా గొప్ప.. కౌసల్య కూతురిగా ‘కౌసల్యజ’ అనే భావన! ‘‘నడక, నాట్యం రెండూ ఒకేసారి నేర్చుకున్నాను’’ అన్నారు భావనారెడ్డి. నాట్యం ఆమెకి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందనిపిస్తుంది. కానీ భావన మాత్రం అమ్మానాన్నల జన్యువుల్లోంచే వచ్చిందంటారు. ‘‘ఫలానా వయసులో నాట్యసాధన మొదలు పెట్టాను... అని చెప్పడానికి వీలే లేదు. ఎందుకంటే... నడకతోపాటే నాట్యం కూడా అలవడింది. నడక రాకముందు నుంచే నాట్యాన్ని చూస్తున్నాను. మా ఇంట్లో రోజూ నాట్యసాధన జరుగుతుండేది. ఇంటి వెనుక వైపు విశాల స్థలంలో డాన్స్ క్లాసులు జరుగుతుండేవి’’ అని చెప్పారు. నాలుగున్నర ఏళ్లకు తొలి ప్రదర్శన ఇచ్చిన భావన ఖజురహో, కోణార్క్, కాళిదాస సమరోహ్లలో జరిగే డాన్స్ ఫెస్టివల్స్‌లో కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. ఢాకాలో జరిగిన బెంగాల్ క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్, లండన్‌లోని సాడ్లర్స్ వెల్స్ ఫెస్టివల్స్తోపాటు అమెరికా, కెనడా, యూరప్, యునైటెడ్ ఎమిరేట్స్, ఆసియా ఖండాల్లో విస్తృతంగా పర్యటించి లెక్కకు మించిన ప్రదర్శనలిచ్చారు. ప్రధానమంత్రులు, వేల్స్ యువరాజుతోపాటు అనేకమంది విదేశీ ప్రముఖుల సమక్షంలో మన తెలుగు కళను ప్రదర్శించి మెప్పు పొందారు. ఇవన్నీ మూడు పదుల లోపే. విదేశాల్లో యంగ్ఉమన్ అచీవర్స్ అవార్డు, నార్త్ పవర్‌లిస్ట్ అవార్డు, టెక్సాస్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నుంచి లైఫ్‌టైమ్ అవార్డులు అందుకున్నారు. అన్నింటికంటే తనకు మనదేశంలో సంగీత నాటక అకాడమీ నుంచి అందుకున్న ప్రతిష్ఠాత్మకమైన ‘బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2017’ అత్యంత సంతోషాన్నిచ్చింది అంటారామె. న్యూయార్క్, న్యూ ఢిల్లీలో ప్రదర్శనల తర్వాత కొంత విరామం తీసుకుని అమ్మమ్మను చూడటానికి ఆదిలాబాద్‌కి వెళ్లారామె. ఆదిలాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తూ సోమవారం రోజు హైదరాబాద్‌లో అక్క యామిని దగ్గర ఆగారు. ఆ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. టీనేజ్‌కి వచ్చాకే స్టేజ్ ఫియర్! భావన ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారులు పద్మభూషణ్ రాజారెడ్డి, కౌసల్య (రాధారెడ్డి చెల్లెలు)ల పుత్రిక. నడకలో అడుగులు, నాట్యపు అడుగుల మధ్య తేడా తెలియని వయసులోనే వేదికనెక్కడంతో స్టేజ్ ఫియర్ అనేది తెలియనే లేదామెకి. ఇంట్లో జరిగే డాన్సు క్లాసుకి, వేదిక మీద ప్రదర్శనకి మధ్య తేడా తెలియని వయసది. అయితే బాల్యంలో లేని స్టేజి ఫియర్ టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత ఆవరించింది. నలుగురి ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదో తెలియని సిగ్గు కలవరపెట్టేది. దానిని అధిగమించి ప్రదర్శన ఇవ్వడానికి తనకు తానే ధైర్యం చెప్పుకునేదాన్నంటారామె. స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ప్రేక్షకులు చూస్తున్నారనే భావనను అదిమిపెట్టి తాను ప్రదర్శిస్తున్న పాత్ర మీదనే మనసు లగ్నం చేసేదాన్నని, క్రమంగా వయసు పరిణతితో అధిగమించగలిగానని చెప్పారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బి.కామ్. ఆనర్స్ చదివిన భావన.. నాట్య ప్రదర్శనల కోసం తరచూ విదేశాలకు వెళ్లొస్తుంటారు. ఒకే ఒక ఉత్తరం ‘‘ఏడేళ్ల వయసులో అమ్మతోపాటు పెర్ఫార్మ్ చేశాను. అమ్మ కౌసల్య... రాముడి తల్లి కౌసల్య పాత్ర చేస్తోంది, నేను రాముడి పాత్ర చేశాను. వేదిక మీద తల్లి పాత్రలో సొంత తల్లితో నాట్యం చేయడం మరచిపోలేని అనుభూతి. ఆ ప్రదర్శన పూనాలో జరిగింది. ఆ ప్రదర్శనలో నా నాట్యాన్ని ప్రశంసిస్తూ ఢిల్లీలో మా ఇంటికి నా పేరుతో ఉత్తరం వచ్చింది. నాకు వచ్చిన ఒకే ఒక్క ఫాన్మెయిల్ అది. అమ్మ పాత్రలో అమ్మతో కలిసి చేయడం ఒక సంతోషమైతే, అదే పెర్ఫార్మెన్స్కి నా పేరుతో ఉత్తరం రావడం తీపి జ్ఞాపకం. ఇంకా బాగా చేయాల్సింది కృష్ణుడి పాత్రలో నటించడం చాలా ఇష్టం. అప్పుడే టీనేజ్‌లో కొచ్చాను. వారణాసిలో కాళీయమర్దన రూపకాన్ని ప్రదర్శించాను. యశోద పాత్రను అమ్మ ప్రదర్శించింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలే వచ్చాయి, నిపుణుల నుంచి కూడా ఎటువంటి విమర్శలూ రాలేదు, కానీ నాకే ఎందుకో ‘ఇంకా బాగా చేయాల్సింది’ అని పదే పదే అనిపించింది. కృష్ణుడిగా ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉండింది. పూర్తిగా న్యాయం చేయలేకపోయానేమోనని ఏడ్చాను. నాకు కృష్ణుడి మీదున్న ఇష్టం వల్లే అలా అనిపించిందో ఏమో కానీ ఆ ప్రదర్శన ఇప్పటికీ గుర్తు ఉంది. బాగా గుర్తుండిపోయిన ప్రదర్శన ఏదని ఎవరడిగినా సరే, నాకు అసంతృప్తిని మిగిల్చిన ఆ ప్రదర్శనే మనసులో మెదలుతుంది. అమ్మానాన్నలేమో ‘నీకు బాగా చేయలేదనిపిస్తే... బాగా చేస్తున్నాను అనే తృప్తి కలిగే వరకు ప్రాక్టీస్ చేయడమే పరిష్కారం. మన పెర్ఫార్మెన్స్ మీద మనకు సంతృప్తి కలిగితేనే ప్రేక్షకులను సమాధానపరచగలుగుతాం. అదే గీటురాయి’ అన్నారు. విరామమన్నదే లేదు రోజూ ఒక గంట యోగా, రెండు గంటలు డ్యాన్స్, ఓ గంట కీళ్ల పటుత్వాన్ని పెంచే ఎక్సర్సైజ్ చేస్తాను. ఆహార నియమాలు పెద్దగా పాటించను. నేను మంచి భోజన ప్రియురాలిని. డ్యాన్స్ చేస్తాను కాబట్టి కేలరీలు ఎప్పటికప్పుడు బర్న్ అయిపోతుంటాయి. ఇన్నేళ్లలో డ్యాన్స్‌కి ఒక్క వారం కూడా విరామం రాలేదు. మూడు రోజులు దాటితే కాళ్లుచేతులు లాగినట్లవుతాయి’’ అంటూ తన చేతి వేళ్లతో నాట్య ముద్రలను చూపిస్తూ నవ్వారు భావన. పాడటం... ఆడటం హాబీ కూచిపూడి నాట్యం నా జీవితంలో భాగమైపోయిందనడం తప్పు, అదే నాకు జీవితం. పాటలు పాడటం, బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూస్తాను. ఇంగ్లిష్ పాటలు, కర్ణాటక సంగీతంలో పాడాను.హాలీవుడ్ సినిమాల్లో పాడటం, ఇంగ్లిష్ పాటలకు కూచిపూడి నాట్యంలో కొరియోగ్రఫీ చేయడం హాబీగానే చేశాను. ప్రొఫెషన్‌గా తీసుకోవడం లేదు. కూచిపూడి నాట్యానికి ఇప్పటి తరం కనెక్ట్ అయ్యేటట్లు భామాకలాపం రూపకాన్ని చేశాను. ఇలాంటి ప్రయోగాలు ఇంకా చేయాలని ఉంది. అందుకు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నాన్న, అమ్మల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. ఇంకా శాస్త్రీయంగా నేర్చుకోవడానికి కూచిపూడి గ్రామంలోని కూచిపూడి యూనివర్సిటీలో డ్యాన్స్ కోర్సు చేయాలనుకుంటున్నాను. – భావనారెడ్డి, కూచిపూడి కళాకారిణి – వాకా మంజులారెడ్డి -
విషం తాగిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి
అనంతపురం : చదువుకోవడం ఇష్టం లేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజమునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ లు చనిపోయారు. మరో విద్యార్ధి చంద్రశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాడికి మండలం పుప్పాల యంగన్నపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించారు. వీరు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గత కొంతకాలంగా చదువు అంటే ఇష్టం లేదని, స్కూల్ కి వెళ్లమని కుటుండసభ్యులకు చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండ వద్దకు చేరుకుని అక్కడ విషపు గుళికలను కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు గమనించి పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అయినా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు లోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు విద్యార్థులు మరణించారు. (యాడికి) -
స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని.. ఆత్మహత్యాయత్నం
యాడికి (అనంతపురం): రోజూ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తుందని విషపు గుళికలు మింగి ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగన్నపల్లి గ్రామ శివారులో ఉన్న కొండమీద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే ఇష్లం లేని ఆ ముగ్గురూ కలిసి విషపు గుళికలను పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటం గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిద్దాం
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థను పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లో ఆ సంఘం రీజినల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుతం కిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. 1.25 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులకు జీవనోపాధి కల్పించిన సంస్థ ప్రస్తుతం రూ.3 వేల కోట్లు అప్పుల్లో ఉందని, ఈ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అయితే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్, రీజియన్ స్థాయి గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్లు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. హడావిడిగా సమ్మెకు నోటీసులివ్వడం, ఎలాంటి హామీలు పరిష్కారం కాకుండానే ఆందోళన విరమించుకోవడం కార్మికుల పట్ల ఆ సంఘాలకు ఉన్న చిత్తుశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కొందరు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ఈ వైఖరిని మానుకోవాని కోరారు. సమస్యలను పరిష్కరించి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఎస్.ఎస్. ప్రసాద్, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, కె.ఎ.ఖాన్, ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పాల్గొన్నారు. -
వీరసైనికుడు రాజారెడ్డికి సలాం
-
నృత్య నూతనం
‘థాంక్యూ ఇందిరా! ఐ హావ్ సీన్ కంప్లీట్ ఇండియా ఇన్ రాధా అండ్ రాజారెడ్డీస్ డ్యాన్స్ ఇన్క్లూడింగ్ యూ’.. ఇది ఫిడెల్ క్యాస్ట్రో కూచిపూడి కపుల్ రాధారెడ్డి, రాజారెడ్డిల కూచిపూడి ప్రదర్శన గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చెప్పిన మాటలు. ఇంతకుమించిన కితాబు ఇటు కూచిపూడికి, అంతకన్నా గొప్ప పరిచయం అటు ఆ జంటకూ ఉండదేమో! తమ జీవననృత్యం గురించి సిటీప్లస్‌తో ముచ్చటించారు. ప్రణయమూర్తులనగానే పురాణాల్లోని రాధాకృష్ణులు, రతీమన్మథులు ఎలా గుర్తొస్తారో.. కూచిపూడి లాస్యంలో లయబద్ధంగా సాగిపోయే జంట అనగానే రాధా, రాజారెడ్డిలు కనిపిస్తారు. అందుకేనేమో ‘మేమిద్దరం కూచిపూడిని పెళ్లాడాం’ అంటారు రాజారెడ్డి. భార్యభర్తల అభిరుచులు ఒకటే అయి.. అవి వారికి ప్రాణమైతే ఆ కాపురం ఆదర్శ ప్రాయం అవుతుంది. కలహకలాపాలు.. నాట్యానికి గుర్తింపు లేని ప్రాంతంలో, కుటుంబాల్లో పుట్టిన ఈ ఇద్దర్ని కలిపింది మూడుముళ్ల బంధం. ఒక్కరిగా మారిన ఆ ఇద్దరి ధ్యాస నాట్యం మీదే. కూచిపూడిని ఆరాధిస్తూ సాగిన ఆ జీవితం.. ఆనంద లాస్యమైంది. ఈ కాపురంలో కలహాలు భామాకలాపంతో చల్లబడితే, గిల్లికజ్జాలు తరంగంతో సద్దుమణుగుతాయి. ‘రాధకు జెలసీ ఎక్కువ. నా కన్నా బాగా కనపడాలని, నాట్యంలో నన్ను ఓడించాలని, వేదికపై ఎవరినీ లెక్క చేయదు. అలా నాట్యంలో లీనమై పోతుంది. విలువైన సలహాలిస్తుంది’ అని తన భార్య గొప్పదనాన్ని ప్రశంసిస్తారు రాజారెడ్డి. ‘ఆయన కంపోజిషన్‌లో నాకు నచ్చనిది ఉంటే చేయను. అలాగే అతని నాట్యంలో కాని, మేకప్‌లో కాని ఫలానాది బాగా లేదు అంటే అంతే వినయంగా దాన్ని సరిదిద్దుకుంటాడు’ అని భర్తలోని వినమ్రతను మెచ్చుకుంటారు రాధారెడ్డి. నాట్య సంగమం.. నిజానికి రాధారెడ్డికి నాట్యం నేర్పిందే రాజారెడ్డి. ‘ ఈ రెబల్ స్టూడెంట్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటాడు నా మాస్టార్’ అంటూ భర్త సహకారాన్ని గుర్తు చేసుకుంటారామె. ‘మా మధ్య తగాదా ఏ వంటగదిలోనో, హాల్లోనో మొదలుకాదు..గ్రీన్‌రూమ్‌లో స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్తో ఎండ్ అవుతుంది. మా పంతం నాట్యంతోనే నెగ్గించుకుంటాం’ అని జీవననృత్యం వెనుక ఉన్న సత్యాన్ని వివరిస్తారు రాజారెడ్డి. ఆయనకు నాట్యం, వైవాహిక బంధం రెండూ ఒకటే. ‘అందుకే మా జంట అంతగా కుదిరింది. ఇన్నేళ్లయినా మా జీవితం తాజాగా కనబడుతోంది’ అంటారు. రాధారెడ్డి మాత్రం ‘నాకు నాట్యం వేరు, మా జీవితం వేరు. ప్రదర్శనప్పుడు ఆయన నాకు పార్ట్నర్ మాత్రమే. ఇంట్లో నా భర్త. ఈ తేడాను చూస్తాను కాబట్టే రాజా నాకెప్పటికప్పుడు కొత్తగా క నిపిస్తాడు. మా సక్సెస్ సీక్రెట్ ఆ కొత్తదనమే’ అని చెప్తారు. సప్తపది.. ఇష్టపది.. ‘డ్యాన్స్ అని భార్యని పట్టుకుని ఊరు కాని ఊరు పోతున్నవ్? ఎట్ల బతుకుతర్రా? ఆ డ్యాన్సేమన్నా కూటికొచ్చేదా?’ అని రాజారెడ్డి పెద్దలు ఆయనను హెచ్చరించారు. ‘గజ్జె కట్టుకొని ఇంటింటికి పొయ్యి ఆడతాడట.. ఇసంటోడు మనకొద్దు..’ అని రాధారెడ్డికి వాళ్ల పెద్దలూ నచ్చచెప్పారు. ఆ పెద్దల మాట చెల్లలేదు. ఏడడుగులతో ఒక్కటైన ఈ జంట ఏడేడు జన్మల బంధానికి దారి ఏర్పరచుకుంది. కూచిపూడిలో తామేంటో నిరూపించు కుంది. అలీనోద్యమ సమావేశాలప్పుడు వివిధ దేశాల ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడిని చివరన ఏర్పాటు చేస్తే.. మనసారా ఆస్వాదించొచ్చు అని అభ్యర్థించారు. వన్స్‌మోర్ వన్స్‌మోర్ అంటూ పదిసార్లు ఈ జంటకాళ్లకు గజ్జె కట్టించారు. ‘మీరసలు ఢిల్లీ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు’ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆప్యాయతతో వాళ్లను ఆజ్ఞాపించింది. ‘రాధా.. నువ్ కాస్త పొట్టిగా ఉంటావ్, పెద్దంచు చీర కట్టకు’ అని ప్రేమతో సలహాలిచ్చే సన్నిహితురాలిని చేసింది వీళ్ల ప్రతిభే. ప్రతి ప్రదర్శన హనీమూనే.. ‘ఏ జంటకైనా హనీమూన్ ఒక్కసారే. కానీ మాకు ప్రతిప్రదర్శన హనీమూనే’ అంటారు రాజారెడ్డి. ‘డ్యాన్స్ లేకపోతే నేనెంత లేనో.. రాజా లేకపోతే కూడా అంతే శూన్యం’ అని చెప్తారు రాధారెడ్డి. - సరస్వతి రమ -
దిల్ దీవానా టీంతో చిట్ చాట్
-
దిల్ దీవానా మూవీ స్టిల్స్