‘సీఎం కేసీఆర్‌ చెప్పేవి అబద్ధాలు’ | RTC JAC Leader Raja Reddy Fires On CM KCR Over RTC Strike | Sakshi
Sakshi News home page

‘సీఎం కేసీఆర్‌ చెప్పేవి అబద్ధాలు’

Published Sat, Oct 26 2019 3:43 AM | Last Updated on Sat, Oct 26 2019 3:43 AM

RTC JAC Leader Raja Reddy Fires On CM KCR Over RTC Strike - Sakshi

సభలో మాట్లాడుతున్న జస్టిస్‌ చంద్రకుమార్‌

ఉస్మానియా యూనివర్సిటీ: ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ చెప్పే మాటలు అబద్ధాలని జేఏసీ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ నేత ఆశప్ప అధ్యక్షత వహించగా టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, జస్టిస్‌ చంద్రకుమార్, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడిపాపాయ్య మాదిగ, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఝాన్సీ, సంధ్య, విమల, విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

చొచ్చుకొచ్చిన టీఆర్‌ఎస్వీ నేతల అరెస్ట్‌ 
బహిరంగ సభ జరుగుతుండగా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ టీఆర్‌ఎస్వీ విద్యార్థి నేతలు వేదిక వద్దకు చొచ్చుకొచ్చారు. సభలో ఉన్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్‌ఎస్వీ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు టీఆర్‌ఎస్వీ నేతలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement