ou university
-
‘సీఎం కేసీఆర్ చెప్పేవి అబద్ధాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ చెప్పే మాటలు అబద్ధాలని జేఏసీ నాయకుడు రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ నేత ఆశప్ప అధ్యక్షత వహించగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడిపాపాయ్య మాదిగ, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఝాన్సీ, సంధ్య, విమల, విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. చొచ్చుకొచ్చిన టీఆర్ఎస్వీ నేతల అరెస్ట్ బహిరంగ సభ జరుగుతుండగా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్వీ విద్యార్థి నేతలు వేదిక వద్దకు చొచ్చుకొచ్చారు. సభలో ఉన్న ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్వీ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు టీఆర్ఎస్వీ నేతలను వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. -
రాష్ట్రపతి.. ఓ చిరుద్యోగి
అదేంటి రాష్ట్రపతి... ఓ చిరుద్యోగి ఏంటిఅనుకుంటున్నారా? ఈయన దేశ రాష్ట్రపతి కాదండి.. ఓయూ రాష్ట్రపతి.యూనివర్సిటీలకు కూడా రాష్ట్రపతి ఉంటారా అంటారా? అయితే ఇది చదవండి..మీకే అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లుగా టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఆయన పేరే రాష్ట్రపతి. ఇది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరే. దీంతో ఆయన ఓయూ రాష్ట్రపతిగా పేరొందారు. ఈ నెల 31న రాష్ట్రపతి ఉద్యోగ విరమణ చేయనున్నారు. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలసి టీచర్‌గా పనిచేసిన పత్రి శంకరయ్య, బస్వమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో రాష్ట్రపతి చిన్నవాడు. రాష్ట్రపతి సోదరులకూ చివరికి ‘పతి’ అని వచ్చేలా విశ్వపతి, ఉమాపతి, గణపతి, గజపతి అని పేర్లు పెట్టారు. అయితే చివరి వాడైన రాష్ట్రపతి పేరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత 1980లో ఓయూలో టెక్నీషియన్ ఉద్యోగంలో చేరి... కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లు సేవలందించాడు. అతను రాష్ట్రపతి కాలేకపోయిన... ప్రతిరోజు రాష్ట్రపతి అని పిలుపించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని సహోద్యోగులు పేర్కొన్నారు. -
నిలిచిపోయిన ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు
హైదరాబాద్: ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాస్తవానికి జూలై 30న పీహెచ్‌డీలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. కానీ అధ్యాపకుల కొరత వల్ల పెరిగిన విద్యార్థుల సంఖ్యను బట్టి పర్యవేక్షకులు లేకపోవడంతో ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను నిలిపివేశారు. కొన్ని విభాగాల్లో ఒకటి, రెండు సీట్లు ఉండగా అర్థశాస్త్రం విభాగంలో ఒక్క గైడ్ కూడా లేకపోవడంతో ఆయా విభాగాల అధిపతులు పర్యవేక్షకుల వేటలో పడ్డారు. రిటైర్డ్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విభాగాల అధిపతులు విశ్రాంత అధ్యాపకులను ఆహ్వానిస్తున్నారు. అయితే చాలా మంది రిటైర్డ్ అధ్యాపకులు ఓయూలో గైడ్షిప్ను తిరస్కరిస్తున్నారు. అన్ని అర్హతలు గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు కూడా గైడ్షిప్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు వీసీ, రిజిస్ట్రార్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సీట్లు సరిపడా ఉన్న విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల జాబితా విడుదల చేయా లని విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఒకేసారి ప్రకటన వెలువడినందున, జాబితాను కూడా ఒకే సారి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. -
తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిన ఓయూ