అదేంటి రాష్ట్రపతి... ఓ చిరుద్యోగి ఏంటిఅనుకుంటున్నారా? ఈయన దేశ రాష్ట్రపతి కాదండి.. ఓయూ రాష్ట్రపతి.యూనివర్సిటీలకు కూడా రాష్ట్రపతి ఉంటారా అంటారా? అయితే ఇది చదవండి..మీకే అర్థమవుతుంది.
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లుగా టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఆయన పేరే రాష్ట్రపతి. ఇది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరే. దీంతో ఆయన ఓయూ రాష్ట్రపతిగా పేరొందారు. ఈ నెల 31న రాష్ట్రపతి ఉద్యోగ విరమణ చేయనున్నారు. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలసి టీచర్‌గా పనిచేసిన పత్రి శంకరయ్య, బస్వమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో రాష్ట్రపతి చిన్నవాడు. రాష్ట్రపతి సోదరులకూ చివరికి ‘పతి’ అని వచ్చేలా విశ్వపతి, ఉమాపతి, గణపతి, గజపతి అని పేర్లు పెట్టారు. అయితే చివరి వాడైన రాష్ట్రపతి పేరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత 1980లో ఓయూలో టెక్నీషియన్ ఉద్యోగంలో చేరి... కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లు సేవలందించాడు. అతను రాష్ట్రపతి కాలేకపోయిన... ప్రతిరోజు రాష్ట్రపతి అని పిలుపించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని సహోద్యోగులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment