Rashtrapati
-
పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతం! : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మొదట ఆమె శ్రీరంజన్ సిల్క్ వీవ్స్ యూనిట్‌ను సందర్శించి దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. కూకున్స్ నుంచి సింగిల్ యారన్ దారం తయారీ, దారాన్ని డబులింగ్, ట్విస్టింగ్, వార్పింగ్, వెప్టింగ్ చేసి చివరకు 2ప్లే దారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు. పట్టుగూళ్ల నుంచి ముడి పట్టును తీసి, మేలు రకమైన పట్టుదారం తయారు చేయడం, దాని నుంచి పడుగు, పేకలను రూపొందించి రంగులద్ది, టై అండ్ డైలో డిజైన్లను రూపొందించడం, ఆసు యంత్రపై చిటికిపోసి పలు రకాల డిజైన్లతో చీరలు తయారు చేయడం తదితర విషయాలను శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి స్పందిస్తూ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టస్సార్ సిల్క్‌ను వినియోగిస్తారని, కానీ మల్బరీ సిల్క్ నాణ్యత బాగుందని తన స్వరాష్ట్రమైన ఒడిశాలో కూడా మల్టీ హ్యాండ్లూమ్ యూనిట్లు నెలకొల్పేందుకు తన పర్యటన ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. థీమ్ పెవిలియన్‌లో పర్యటన.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌లో చేనేతకు సంబంధించిన పలు వస్త్రాల తయారీపై చేనేత కళాకారులు రాష్ట్రపతికి వివరించారు. పుట్టపాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. నూనెలో దారాన్ని నానబెట్టి ప్రాసెసింగ్ చేసి తేలియారుమాల్ వస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిందని చెప్పారు. భూదాన్‌పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరలు, గద్వాల సిల్క్ చీరలు, వరంగల్ రామప్ప చీర, భూపాలపల్లి టస్సర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల గురించి చేనేత జౌళిశాఖ డీడీ అరుణ్‌కుమార్ వివరించారు. నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు, వరంగల్ దుర్రీస్ తివాచీలు, 14వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగాబాద్‌లో నేసిన హిమ్రా చీరల (అప్పట్లో రాయల్ ఫ్యామిలీలకు బహుమతిగా ఇచ్చేవారు) గురించి జౌళిశాఖ డీడీ వెంకటేశం రాష్ట్రపతికి వివరించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఇక్కత్ వస్త్రాలు, గద్వాల చీరలు, గొల్లభామ చీరల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. చేనేత కళాకారులు ఆమెకు ఆయా వస్త్రాల తయారీ గురించి చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో వస్త్రాల అమ్మకం గురించి సాయిని భరత్, ఎన్జీఓ సుధ రాష్ట్రపతికి వివరించారు. పడుగు, పేకల కోసం వినియోగించే 30 చరఖా (రాట్నం)లను మహిళలు తిప్పుతుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని పరిశీలించారు. చరఖా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మగ్గంపై నేత తీరును పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం రూపొందించిన ఆసు యంత్రాన్ని పరిశీలించి దాని పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీరంజన్ వీవ్స్ మల్టీ యూనిట్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్ని సంవత్సరాలుగా మగ్గం పనిచేస్తున్నారని, ఈ వృత్తి వల్ల నెలకు ఎంత కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా చేనేత కళాకారులను తాము మెహర్ అని పిలుచుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి చేనేత కళాకారుల నేత నైపుణ్యం గొప్పగా ఉందని కొనియాడారు. అనంతరం చేనేత కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ దంపతులు రాష్ట్రపతికి సంబల్పురి డిజైన్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీర, పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరను అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఉన్నారు. పోచంపల్లిలో రెండు గంటలు గడిపిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లిలో రెండుగంటల పాటు గడిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక చాపర్‌లో పోచంపల్లికి చేరుకున్నారు. శ్రీరంజన్ వీవ్స్ యూనిట్లో 20 నిమిషాల పాటు వీవింగ్, ట్విస్టింగ్ ప్రక్రియలను పరిశీలించారు. 10.55 గంటలకు బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖా రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి 11.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. చేనేత కార్మికులచే సన్మానం పొందారు. 12.15 గంటలకు రాష్ట్రపతి చేనేత కార్మికులనుద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం 12.30 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. 12.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవి కూడా చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
రాష్ట్రపతి.. ఓ చిరుద్యోగి
అదేంటి రాష్ట్రపతి... ఓ చిరుద్యోగి ఏంటిఅనుకుంటున్నారా? ఈయన దేశ రాష్ట్రపతి కాదండి.. ఓయూ రాష్ట్రపతి.యూనివర్సిటీలకు కూడా రాష్ట్రపతి ఉంటారా అంటారా? అయితే ఇది చదవండి..మీకే అర్థమవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లుగా టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఆయన పేరే రాష్ట్రపతి. ఇది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరే. దీంతో ఆయన ఓయూ రాష్ట్రపతిగా పేరొందారు. ఈ నెల 31న రాష్ట్రపతి ఉద్యోగ విరమణ చేయనున్నారు. విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలసి టీచర్‌గా పనిచేసిన పత్రి శంకరయ్య, బస్వమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో రాష్ట్రపతి చిన్నవాడు. రాష్ట్రపతి సోదరులకూ చివరికి ‘పతి’ అని వచ్చేలా విశ్వపతి, ఉమాపతి, గణపతి, గజపతి అని పేర్లు పెట్టారు. అయితే చివరి వాడైన రాష్ట్రపతి పేరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత 1980లో ఓయూలో టెక్నీషియన్ ఉద్యోగంలో చేరి... కెమిస్ట్రీ విభాగంలో 38 ఏళ్లు సేవలందించాడు. అతను రాష్ట్రపతి కాలేకపోయిన... ప్రతిరోజు రాష్ట్రపతి అని పిలుపించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని సహోద్యోగులు పేర్కొన్నారు. -
రాష్ట్రపతి దృష్టికి గిరిజనుల సమస్యలు
సీతంపేట విజయ నగరం : రాష్ట్రపతిని కలిసేందుకు గిరిజన జేఏసీ నేతలు బుధవారం బయలు దేరారు. వివిధ జిల్లాల నుంచి 15 మంది నాయకులు జాతీయ ఆదివాసీ సంఘాల చైర్మన్ జితేందర్ సింగ్ చౌదరి, త్రిపుర ఎంపీ ఆధ్వర్యంలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. వాల్మీకి, బోయ, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని, 1460 నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని, గిరిజన యూనివర్సిటీ తదితర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ బిడ్డిక తేజేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర జేఏసీ నేతలు ఎం.బాబురావు, కోలక లక్ష్మణమూర్తి, ఎం.శ్యామల రావు రాష్ట్రపతిని కలవనున్నామన్నారు. ఐటీడీఏ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 133 రోజులకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ నేతలు పి.భూదేవి, పి.కృష్ణారావు, ఎస్.గంగారావు, రాజారావు, రామస్వామి పాల్గొన్నారు. -
భవానీ ద్వీపంలో రాష్ట్రపతి కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి విజయవాడలోని భవానీ ద్వీపంలో బుధవారం పర్యటించారు. పున్నమిఘాట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో వారు కృష్ణానదిలో విహరించారు. దాదాపు మూడు గంటల పాటు వారు విజయవాడలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ముందుగా స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ గులాబీల ప్రదర్శనను వారు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. 600 రకాల గులాబీలను ఒకేచోట ప్రదర్శించిన మహిళలను అభినందించారు. పూల సోయగాలు, వాటి అలంకరణ బాగుందని ప్రశంసించారు. అనంతరం వారు ఇంద్రకీలాద్రిపై వెలసిన కనదుర్గమ్మను దర్శించుకుని అక్కడి నుంచి పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటులో భవానీ ద్వీపం చేరుకున్నారు. అక్కడ వారికి రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ హేమాన్షు శుక్లా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులను ఆహ్లాదపరిచే విధంగా ఏర్పాటు చేసిన కోలాటం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన ధింసా నృత్యాన్ని తిలకించారు. భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంగళగిరి పట్టు చీరల స్టాల్‌ను సందర్శించి వాటి నాణ్యత ప్రమాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి స్టాల్‌ను సందర్శించి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి వాటి విశేషాలను తెలుసుకున్నారు. బందరు మిఠాయి స్టాల్ వద్ద బందరు లడ్డూ రుచులను ఆస్వాదించారు. ప్లోటింగ్ పౌంటేయిన్, మ్యూజికల్ లేజర్ షోను తిలకించారు. అక్కడి నుంచి పర్యాటక శాఖకు చెందిన బోధసిరి ప్రత్యేక పడవలో పున్నమి ఘాట్ చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డీసీపీ క్రాంతి రాణా టాటా నేతృత్వంలో ప్రత్యేక అధికారులు రాష్ట్రపతి కుటుంబసభ్యులు సందర్శించే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సుజాతశర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం
-
సీవీసీగా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేవీ చౌదరితో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా కేవీ చౌదరి (కొసరాజు వీరయ్య చౌదరి) కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు. -
ఈ రాత్రికి రాష్ట్రపతికి చేరనున్న తెలంగాణ బిల్లు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఈ రాత్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుతుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాత ఈ కేంద్ర న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ పరిశీలన తర్వాత కేంద్ర హోం శాఖ వద్దకు చేరింది. ఆ శాఖ పరిశీలన కూడా పూర్తి అయింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. హోం శాఖ నుంచి ఈ రాత్రికి రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తరువాత తెలంగాణ బిల్లు చట్టంగా మారుతుంది. దాంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. అయితే రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే రోజు( నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజన్నది ఇంకా నిర్ణయించవలసి ఉంటుంది. -
గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి పునఃప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రధాని రాష్ట్రపతిని కలిశారు. పార్లమెంట్ సమావేశాలపైన వీరు చర్చిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)పై రాష్ట్ర శాసనసభలో చర్చకు గడువు పెంపు అంశంపైన కూడా వారు చర్చించే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి నిర్ణయంపై ఉత్కంఠ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపు అంశం ఇప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు ఉంది. ఆయన తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క బిల్లుపై చర్చకు గడువు పొడగించవద్దంటూ తెలంగాణ మంత్రులు రాష్ట్రపతికి లేఖ ఫ్యాక్స్ చేశారు. చర్చకు శాసనసభ సమావేశాల గడువు పొడగిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని వివిధ పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నేతలమంతా వచ్చి కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ ఇవ్వమని తెలంగాణ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరారు. మరో పక్క ఇప్పటికే మరో నెల రోజులు గడువు పొడగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు కోరారు. విభజనను అడ్డుకునేందుకే వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడగించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్) పి.కె.మహంతి రాసిన లేఖను కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది. రాష్ట్రపతి తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
రేపు ఉదయం రాష్ట్రపతిని కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు జగన్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రేపు ఉదయం జగన్‌తోపాటు పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుస్తారు. జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రాష్ట్రపతి వద్దకు వెళతారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని వారు రాష్ట్రపతిని కోరతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఈ బృందం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇస్తుంది. -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది కోసం ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడికి వచ్చారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వద్ద దిగిన రాష్ట్రపతికి రాష్ట్రగవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, నగర మేయర్ మజీద్ తదితరులు స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి బొల్లారం వెళ్లారు. -
జనవరి 23వరకు గడువు ఇచ్చిన రాష్ట్రపతి
-
జనవరి 23వరకు గడువు ఇచ్చిన రాష్ట్రపతి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 23 వరకు గడువు ఇచ్చారు. ఈ బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ ముసాయిదా బిల్లు ఈ సాయంత్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి చేరుతుంది. గతంలో ఇతర రాష్ట్రాలలో విభజన జరిగిన సమయంలో అనుసరించిన పద్దతుల ప్రకారమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేస్తారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత గవర్నర్ నరసింహన్‌కు పంపుతారు. గవర్నర్ పరిశీలించిన తరువాత బిల్లును శాసనసభ కార్యదర్శి ఎస్.రాజా సదారాంకు పంపుతారు. అక్కడ నుంచి బిల్లు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ వద్దకు చేరుతుంది. ఈ క్రమంలో బిల్లు పరిశీలనకు ఒక్కొక్కరు ఒక్కో రోజు సమయం తీసుకోవచ్చు. అయితే మన రాష్ట్రంలో మాత్రం బిల్లు సోమవారానికి శాసనసభకు చేరే అవకాశం ఉంది. ఇంత తతంగం జరిగినా అది కేవలం అభిప్రాయంగానే పరిగణిస్తారు. శాసనసభ అభిప్రాయానికి ఎటువంటి విలువ ఉండదు. కేంద్రం తన ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
వైఎస్ జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్
-
రేపు రాష్ట్రపతిని కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ లభించింది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈనెల 5న జరుగనున్న ఐపీఎస్‌ల పెరేడ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్న విషయం తెలిసిందే. రేపు రాత్రి 9 గంటలకు జగన్ రాష్ట్రపతిని కలుస్తారు. ఆయనతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని జగన్ రాష్ట్రపతిని కోరతారు. -
రాష్ట్రపతిని కలిసిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు.
-
'అన్ని సదుపాయాలున్న హైదరాబాద్‌ను వదలమంటే ఎలా?'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరామని చెప్పారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని వివరించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ను యూటి చేస్తే ఇరుప్రాంతాలు నష్టపోతాయని చెప్పామన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితంకావని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం ఏది కావాలన్నా రాజధానికే రావలసిన పరిస్థితి ప్రస్తుతం ఉందని తెలిపారు. ఇప్పుడు మెట్రో రైలు కూడా వస్తోంది. ఇన్ని సదుపాయాలున్న హైదరాబాద్ వదిలి వెళ్లిపొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. వీరు గత నెలలో కూడా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. ఈ మేరకు వారు ఒక వినతి పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. -
రాష్ట్రపతి పాలన విధించాలి
చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి, సీమాంధ్ర పాలనకు స్వస్తి చెప్పాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాడి రాజన్నయాదవ్, వెంకట్రావ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఏపీఎన్జీవోల సభ కేవలం తెలంగాణ బిడ్డల మీద దాడి చేయడానికే పెట్టారన్నారు. కలిసుండాలని కోరుకునే వార సభలో తెలంగాణ భావ స్వేచ్ఛను చాటిన కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులపై చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 50 శాతం మధ్యంతర భృతి, ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఈటీ, భాష పండితుల పోస్టుల అప్‌గ్రేడేషన్, రూ. 398 పే, ఎసీ, ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాదవ్ కిరణ్‌కుమార్, జాడి మురళి, ఉపాధ్యక్షులు రాజేశ్‌నాయక్, అరుణ్, జంపన్న, మాధవ్ ఉన్నారు. -
రాష్ట్రపతి ముందు రాయల-తెలంగాణ ప్రతిపాదన
ఢిల్లీ: రాయలసీమ నేతలు ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన రాయల-తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనను ఆయన ముందుంచారు. రాష్ట్రపతికి కలిసినవారిలో రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్ ఉన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు జరిగే నష్టం గురించి తెలిపారు. అలాగే రాయలతెలంగాణ ప్రతిపాదన గురించి కూడా వివరించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పటి నుంచి రాయల-తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు రాయల-తెలంగాణ అంటే, మరికొందరు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఈరోజు సీమ నేతలు రాష్ట్రపతికి కలిసి తమ సమస్యలు వివరించారు.