రాష్ట్రపతి పాలన విధించాలి
Published Mon, Sep 9 2013 3:14 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే రాష్ట్రపతి పాలన విధించి, సీమాంధ్ర పాలనకు స్వస్తి చెప్పాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాడి రాజన్నయాదవ్, వెంకట్రావ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఏపీఎన్జీవోల సభ కేవలం తెలంగాణ బిడ్డల మీద దాడి చేయడానికే పెట్టారన్నారు. కలిసుండాలని కోరుకునే వార సభలో తెలంగాణ భావ స్వేచ్ఛను చాటిన కానిస్టేబుల్‌పై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు.
అలాగే విద్యార్థి సంఘాల నాయకులపై చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు 50 శాతం మధ్యంతర భృతి, ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పీఈటీ, భాష పండితుల పోస్టుల అప్‌గ్రేడేషన్, రూ. 398 పే, ఎసీ, ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాదవ్ కిరణ్‌కుమార్, జాడి మురళి, ఉపాధ్యక్షులు రాజేశ్‌నాయక్, అరుణ్, జంపన్న, మాధవ్ ఉన్నారు.
Advertisement
Advertisement