ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 23 వరకు గడువు ఇచ్చారు. ఈ బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ ముసాయిదా బిల్లు ఈ సాయంత్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి చేరుతుంది.