
వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చారు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రేపు ఉదయం జగన్తోపాటు పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుస్తారు. జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రాష్ట్రపతి వద్దకు వెళతారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని వారు రాష్ట్రపతిని కోరతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఈ బృందం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇస్తుంది.