రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గిరిజన జేఏసీ నేతలు
సీతంపేట విజయ నగరం : రాష్ట్రపతిని కలిసేందుకు గిరిజన జేఏసీ నేతలు బుధవారం బయలు దేరారు. వివిధ జిల్లాల నుంచి 15 మంది నాయకులు జాతీయ ఆదివాసీ సంఘాల చైర్మన్ జితేందర్ సింగ్ చౌదరి, త్రిపుర ఎంపీ ఆధ్వర్యంలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. వాల్మీకి, బోయ, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని, 1460 నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని, గిరిజన యూనివర్సిటీ తదితర సమస్యలు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని గిరిజన జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ బిడ్డిక తేజేశ్వరరావు తెలిపారు.
రాష్ట్ర జేఏసీ నేతలు ఎం.బాబురావు, కోలక లక్ష్మణమూర్తి, ఎం.శ్యామల రావు రాష్ట్రపతిని కలవనున్నామన్నారు. ఐటీడీఏ వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 133 రోజులకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన జేఏసీ నేతలు పి.భూదేవి, పి.కృష్ణారావు, ఎస్.గంగారావు, రాజారావు, రామస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment