కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
న్యూఢిల్లీ : కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేవీ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాష్ట్రపతి భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేవీ చౌదరితో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా కేవీ చౌదరి (కొసరాజు వీరయ్య చౌదరి) కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందినవారు. 1954 అక్టోబర్ 10న జన్మించారు. తండ్రి కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు మచిలీపట్నంలో అడ్వకేట్‌గా పనిచేశారు. కేవీ చౌదరి ఇంటర్ వరకు కృష్ణా జిల్లాలోనే చదువుకున్నారు. బీఎస్‌సీ మేథమేటిక్స్ చెన్నైలోని లయోలా కాలేజీలో, ఎమ్మెస్సీ మేథమేటిక్స్ ఐఐటీ చెన్నైలో చదివారు.