
రేపు రాష్ట్రపతిని కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ లభించింది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈనెల 5న జరుగనున్న ఐపీఎస్‌ల పెరేడ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రానున్న విషయం తెలిసిందే. రేపు రాత్రి 9 గంటలకు జగన్ రాష్ట్రపతిని కలుస్తారు. ఆయనతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు కూడా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని జగన్ రాష్ట్రపతిని కోరతారు.