
గడువు పొడిగింపుపై రాష్ట్రపతి,ప్రధాని చర్చించే అవకాశం
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు. పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి పునఃప్రారంభం కానున్న నేపధ్యంలో ప్రధాని రాష్ట్రపతిని కలిశారు.
పార్లమెంట్ సమావేశాలపైన వీరు చర్చిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు(తెలంగాణ బిల్లు)పై రాష్ట్ర శాసనసభలో చర్చకు గడువు పెంపు అంశంపైన కూడా వారు చర్చించే అవకాశం ఉంది.