
ప్రణబ్ ముఖర్జీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) ఈ రాత్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుతుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాత ఈ కేంద్ర న్యాయశాఖకు చేరింది. ఆ శాఖ పరిశీలన తర్వాత కేంద్ర హోం శాఖ వద్దకు చేరింది. ఆ శాఖ పరిశీలన కూడా పూర్తి అయింది. ఇక రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. హోం శాఖ నుంచి ఈ రాత్రికి రాష్ట్రపతి వద్దకు చేరుతుంది.
రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తరువాత తెలంగాణ బిల్లు చట్టంగా మారుతుంది. దాంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. అయితే రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే రోజు( నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజన్నది ఇంకా నిర్ణయించవలసి ఉంటుంది.