తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ | IAS Officers Transferred In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Dec 17 2023 4:18 PM | Updated on Dec 17 2023 4:42 PM

IAS Officers Transferred In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌ అధికారుల పోస్టింగ్ లిస్టు ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బు​ర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేత విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉ‍న్న అర్వింద్‌ కుమార్‌ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.

పురపాలక ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంక కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. 

వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవి

నల్గొండ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌.వి కర్ణన్‌ను నియమించారు.

ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్‌ శ్రీనివాసరాజును నియమించారు. 

జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి అదనపు బాధ్యతలు ఇచ్చారు. 

జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా

అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. 

మహిళ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి  కరుణ నియమితులయ్యారు.

ఇదికూడా చదవండి: నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్‌: సీపీ శ్రీనివాస్‌రెడ్డి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement