IAS transfer
-
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, విజయవాడ: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ బదిలీ కాగా.. వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరిత బదిలీ అయ్యారు.తాజాగా బదిలీల ప్రకారం..ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్.పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలుస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డికార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడువ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత -
11 మంది ఐఏఎస్‌లు బదిలీ
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు ఓ ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం డీఎఫ్ఓ అనంత్ శంకర్‌ను ప్రభుత్వ ప్రణాళిక విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. -
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఎనిమిది మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ.. వాళ్లకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ⇒ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా TK శ్రీదేవి.⇒ కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా రిస్వి ఐఏఎస్ కు అదనపు బాధ్యతలు.⇒ రెవిన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీగా హరీష్ ఐఏఎస్.⇒ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు తనకు బాధ్యతలు టి హరీష్ ఐఏఎస్ కు అప్పగించిన ప్రభుత్వం.⇒ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్ కుమార్ ఐఏఎస్.⇒ MAUD డిప్యూటీ సెక్రటరీగా చెక్క ప్రియాంక ఐఏఎస్.⇒ HACA లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ రెడ్డి.⇒ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం. -
TGO అధ్యక్షురాలు మమతకు షాక్..బదిలీ వేటు.!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపైనే దృష్టి సారించిన కొత్త ప్రభుత్వం రాజధాని నగరంలో కీలకమైన జీహెచ్ఎంసీలోనూ బదిలీలు చేపట్టింది. అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జె.శంకరయ్యను ఇప్పటికే టీఎస్టీఎస్ ఎండీగా పంపించిన సర్కారు... తాజాగా కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది. వారి స్థానంలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీంతో గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను మూడు జోన్లలో ముగ్గురు జోనల్ కమిషనర్లు మహిళలే కావడం గమనార్హం. ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు.. ఇప్పటి వరకు తాను కోరుకున్న ప్రాంతాల్లో తప్ప ఎక్కడికీ కదలబోననే విధంగా వ్యవహరించిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం)కు బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచి్చన అభిలాష అభినవ్‌ను కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ,ఐటీ)గా ఉన్న స్నేహ శబరీ ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా మార్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న బి.శ్రీనివాసరెడ్డిని ఆయన మాతృసంస్థ అయిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌కు బదిలీ చేశారు. ► వీరితో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో ఎస్ఈగా ఉన్న వెంకటరమణను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీ)కు బదిలీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఊహించినట్లుగానే దీర్ఘకాలికంగా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారిని, డిప్యుటేషన్‌పై వచ్చి కీలక స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. వీరి ని పంపించేందుకు సమయం పట్టవచ్చనే అభిప్రాయాలు వెలువడినప్పటికీ జాప్యం లేకుండా బదిలీలు చేసింది. త్వరలోనే మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. అంతర్గత బదిలీలు సైతం ఎన్నికల స్పెషలాఫీసర్‌గా పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వై. శ్రీనివాసరెడ్డిని ఫలక్‌నుమా డిప్యూటీ కమిషనర్ (డీసీ)గా నియమించారు. అక్కడ డీసీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న లావణ్యను ఫలక్‌నుమా ఏఎంసీగా అక్కడే ఉంచారు. సంతోష్ నగర్ డీసీగా ఉన్న వి.నరసింహను కుత్బుల్లాపూర్ డీసీగా బదిలీ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీ ఎ. నాగమణిని సంతోష్ నగర్ డీసీగా బదిలీ చేశారు. డీసీ (ఫైనాన్స్)గా ఉన్న ఎల్.శ్రీలతను చారి్మనార్ డీసీగా బదిలీ చేశారు. చారి్మనార్ డీసీగా ఉన్న ఢాకు నాయక్‌ను కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మరిన్ని మార్పులు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో త్వరలోనే పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అధికారుల బదిలీలతో పాటు పనుల్లోనూ మార్పులు చోటు చేసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో స్పష్టత వచ్చాక ఆమేరకు మార్పులు జరగనున్నాయి. మున్సిపల్ పరిపాలన శాఖను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మూసీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నగరానికి సంబందించి మొదటి సమీక్ష సమావేశాన్ని ఈ నది గురించే నిర్వహించడం.. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలోనూ మూసీని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
TS: భారీ సంఖ్యలో బదిలీ బాట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు పాలనలో మార్పుబాట పట్టింది. ఇప్పటి వరకు వివిధ శాఖలు, విభాగాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చిన పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుతోపాటు కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి తన జట్టును సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాలనా యంత్రాంగంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. తాజాగా ఒకేసారి 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఐఏఎస్‌లలో 18 మందికి పూర్తిగా కొత్త బాధ్యతలు అప్పగించగా.. మిగతా 8 మందికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐపీఎస్‌లలో అందరినీ కొత్త స్థానాలకు బదిలీ చేశారు. నాన్ కేడర్ ఎస్పీ అధికారులకు కొన్ని స్థానాల్లో కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం ఇష్టం లేని, 18 గంటలు పనిచేయాలా అని అసంతృప్తిగా ఉండే అధికారులను పెద్దగా పనిలేని స్థానాలకు బదిలీ చేయడానికి సర్కారుకు అభ్యంతరం లేదని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం గడవక ముందే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు జరగడం గమనార్హం. ఫైనాన్స్ కమిషన్‌కు స్మితా సబర్వాల్ గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా, మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ పెద్దగా ప్రాధాన్యత ఉండని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గత ప్రభుత్వం నవంబర్ 30న ఆమెకు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కానీ సర్కారు మారడంతో ఆమె ఆ బాధ్యతలను చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో నీటి పారుదల శాఖ అదనపు బాధ్యతల నుంచి సైతం స్మితను ప్రభుత్వం తప్పించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించిన భారతి హొళికేరిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్లో పెట్టింది. తాజాగా రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌గా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. భూముల వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు రావడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాహుల్ బొజ్జాకు నీటిపారుదల శాఖ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సుదీర్ఘకాలం నుంచి అప్రాధాన పోస్టుల్లో కొనసాగుతున్న ఎంసీఆర్హెచ్ఆర్డీ అదనపు డీజీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కాకు ఎట్టకేలకు కీలక పోస్టింగ్ లభించింది. ఆయనకు ప్రభుత్వం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న డి.దివ్యను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను గిరిజన శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా.. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి కె.శశాంకకు దక్కింది. నారాయణపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరి్ణకారెడ్డి తల్లి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చిట్టెం లక్ష్మి ఇన్నాళ్లూ వెయిటింగ్లో ఉండగా.. ఆమెను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావుకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య (నాన్ కేడర్)ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం పేషీకి మూడు కొత్త ముఖాలు ప్రభుత్వం మరో ముగ్గురు అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసింది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి జి.చంద్రశేఖరరెడ్డిని ముఖ్యమంత్రికి కార్యదర్శిగా సీఎంఓకు బదిలీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు (నాన్ కేడర్ అధికారి)ను ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సీఎంఓకు బదిలీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా కీలక పదవిలో నియమించారు. దీంతో సీఎం కార్యాలయంలో కీలకమైన పదవుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ సర్వీసెస్, గ్రూప్–1 అధికారులను నియమించినట్టు అయింది. ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి (ఐఏఎస్), కార్యదర్శిగా షానవాజ్ ఖాసీమ్ (ఐపీఎస్), అదనపు కార్యదర్శిగా అజిత్‌రెడ్డి (డిఫెన్స్ సర్వీసెస్) అధికారులను ప్రభుత్వం నియమించింది. మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలు రాష్ట్రంలో మూడు కమిషరేట్లకు ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎల్ఎస్ చౌహాన్‌ను, ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా సునీల్‌దత్, సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బి.అనురాధను ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావును అదనపు డీజీ (టెక్నికల్ సర్వీసెస్)గా ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆయనను ఆదేశించింది. -
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లిస్టు ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది. ►విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేత విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు. ►పురపాలక ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండీఏ, సీడీఎంక కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ►వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టీకే శ్రీదేవి ►నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్.వి కర్ణన్‌ను నియమించారు. ►ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్ శ్రీనివాసరాజును నియమించారు. ►జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ►జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి ►వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా ►అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ►మహిళ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు. ఇదికూడా చదవండి: నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్: సీపీ శ్రీనివాస్‌రెడ్డి -
IAS,IPS బదిలీల విచారణ అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కోరిన కేంద్రం
-
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు.. హైకోర్టులో కేంద్రం పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది. అయితే, కేంద్ర ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గాగా మధుసూదన రెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను బదిలీ చేసింది. ప్రస్తుతం సీఎంఓ స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ కొద్ది సేపటికే ఐఏఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చింది. ఇదీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ -
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె ఎస్ జవహర్ రెడ్డికి టీటీటీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె శ్యామలరావు, స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసుల స్పెషల్ సీఎస్‌గా సాయి ప్రసాద్, ఆర్థిక శాఖలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం సెక్రెటరీగా ముకేష్ కుమార్ మీనా, విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్ సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా చిన వీరభద్రుడు, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా పి రంజిత్ భాషా, హ్యాండ్ల్యూమ్స్ డైరెక్టర్‌గా సి నాగరాణి, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అర్జునరావులను నియమించింది. -
51 ట్రాన్స్ఫర్లు.. బాగా అలవాటైపోయింది
ఛండీగఢ్ : ‘‘ఎంతో చేయాలనుకున్నా. కానీ, మొత్తం నాశనం చేశారు. మరోసారి బదిలీ చేశారు. డేజా వు(ఫ్రెంచ్ భాషలో బాగా అలవాటు అయిపోయిందని అర్థం). ఈ ఆటంకం తాత్కాలిక విరామమే. రెట్టించిన ఉత్సాహంతో ముందకు సాగుతా’’ ఇది హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ట్విట్టర్పేజీలో గత రాత్రి కనిపించిన ఓ ట్వీట్. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న అశోక్(52) తన సర్వీస్‌లో ఇప్పటిదాకా 51 సార్లు బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారికత ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన ఆయనను ఆ శాఖా మంత్రి కృష్ణ బేడీ స్వయంగా తొలగించటానికి కారణం.. మంత్రిపైనే అసంతృప్తి వ్యక్తం చేయటం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహాన్ని కృష్ణ ఏడాది వాడుకోగా.. దానిపై అశోక్ బహిరంగా అసంతృప్తి వెల్లగక్కారు. దీంతో ఈసారి ఆయన బదిలీ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన క్రీడా మంత్రిత్వ శాఖ దగ్గర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను ఎక్కడున్నా.. అవినీతిని నిర్మూలించటమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగత సిబ్బందికి దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా పరిగణించటాన్ని అశోక్ అస్సలు ఊపేక్షించలేదు. ఇక సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారాన్ని(2012) రద్దు చేసింది కూడా ఈయనే కావటం విశేషం. ఆ తర్వాత రవాణా విభాగానికి మారిన ఆయన.. అక్కడా తన పట్టువీడలేదు. ఇలా 20 ఏళ్లలో ఆయనపై మొత్తం 51 సార్లు బదిలీ అయ్యారు. అన్నట్లు హర్యానాలో ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిన రికార్డు మాత్రం ప్రదీప్ కస్నీ(68సార్లు) పేరిటే ఉంది. -
పలువురు ఐఏఎస్‌ల బదిలీ
రెవెన్యూ శాఖకు ప్రదీప్‌చంద్ర అటవీ శాఖకు బీఆర్ మీనా సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్లో ఉన్న కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్రకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనాను అటవీ, పర్యావరణ శాఖకు బదిలీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ అధికారి బీఆర్ మీనాను బదిలీ చేయటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్న వికాస్‌రాజ్‌ను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న కాళీచరణ్ సుదమ్‌రావ్‌కు సీసీఎల్ఏ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.శశిధర్‌ను రిలీవ్ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఈ.శ్రీధర్‌ను పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. కరీంనగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న పౌసమి బసును సెర్ప్ సీఈవో పోస్టుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో వెయిటింగ్లో ఉన్న దేవసేనకు జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వీరితో పాటు అటవీ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ చంద్రను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎదుట రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.