
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె ఎస్ జవహర్ రెడ్డికి టీటీటీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా జె శ్యామలరావు, స్పోర్ట్స్ అండ్ యువజన సర్వీసుల స్పెషల్ సీఎస్‌గా సాయి ప్రసాద్, ఆర్థిక శాఖలో కమర్షియల్ ట్యాక్స్ విభాగం సెక్రెటరీగా ముకేష్ కుమార్ మీనా, విద్యాశాఖ కమిషనర్‌గా ఎస్ సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా చిన వీరభద్రుడు, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా పి రంజిత్ భాషా, హ్యాండ్ల్యూమ్స్ డైరెక్టర్‌గా సి నాగరాణి, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా అర్జునరావులను నియమించింది.