
రోడ్డు ప్రమాదంలో మరణించిన టిక్‌టాక్ స్టార్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టిక్‌టాక్ స్టార్, సోషల్ మీడియా సెలబ్రిటీ ప్రతీక్ ఖత్రి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. టిక్‌టాక్‌తో పాటు పలు ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆయన వీడియోలు వైరల్ కావడంతో ప్రతీక్ ప్రాచుర్యం పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతీక్‌ను 43,200 మంది అనుసరిస్తున్నారు. కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారని ప్రతీక్ స్నేహితులు ధ్రువీకరించారు. ఆషికా భాటియా, భవికా మోత్వానీ వంటి పలువురు స్నేహితులు, సోషల్‌మీడియా ప్రభావశీలురు ప్రతీక్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రతీక్‌తో కలిసిఉన్న ఫోటోలను వారు షేర్ చేశారు.