సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రీల్స్ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. కర్నూలు జిల్లా కోసిగికి చెందిన చిన్నన్నపల్లి తిమ్మయ్య,లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు ఆంజనేయులు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గుర్తింపు కోసం రీల్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఉరుకుందు వైపు బైక్‌పై వెళుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో యువకుడి కళ్లకు ఖర్చీఫ్ అడ్డు పడింది. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేకపోయాడు.
సాయిబాబా ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయే కిందపడ్డాడు.తీవ్రంగా గాయపడిన ఆంజనేయను చికిత్స నిమిత్తం ఆదోనీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment