కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి(90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1929 అక్టోబరు 5న ఆయన జన్మించారు. 1957, 1978లలో ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో తొలిసారిగా పెద్దపల్లి నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.