Venkataswamy
-
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్‌కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్‌ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు. -
నాలుగుసార్లు కోలిండియా స్థాయిలో.. సింగరేణిలోని గోల్డ్‌మెడలిస్ట్!
మంచిర్యాల: బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారు పతకాలతో బత్తుల వెంకటస్వామి విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. కోలిండియా స్థాయి పోటీల్లో రాణిస్తూ సింగరేణిలోని మందమర్రి ఏరియాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. మందమర్రి ఏరియాలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌లో ఫోర్‌మెన్‌గా బత్తుల వెంకటస్వామి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 4 నుంచి 6వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కోలిండియా బాడీ బిల్డింగ్(90 కిలోల విభాగం) పోటీల్లో బంగారు పతకం సాధించి సింగరేణి పేరు దేశవ్యాప్తంగా మారుమోగించాడు.. వెంకటస్వామి 2006లో సింగరేణి ఎక్స్టర్నల్ ఎలక్ట్రీషియన్ పరీక్షలు ఉత్తీర్ణుడై ఎలక్ట్రీ షియన్‌గా విధుల్లో చేరాడు. 2013లో డిపార్టుమెంటల్ పరీక్షలు ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ పాసయ్యాడు. వ్యాయామంపై ఆసక్తితో జిమ్‌లో చేరాడు. ప్రతీరోజు రెండున్నర, మూడు గంటల వరకు సాధన చేశాడు. బాడీ బిల్డింగ్ పోటీలపై మక్కువ పెంచుకున్నాడు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ సింగరేణి స్థాయిలో ఐదేళ్లుగా రానిస్తున్నాడు. అభినందనీయం.. మందమర్రి ఏరియాలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా విధులు నిర్వర్తించే వెంకటస్వామికి కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్ రావడం అభినందనీయం. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెంది మరెన్నో గోల్డ్‌మెడల్స్ సాధించాలి. అందుకు సింగరేణి ప్రోత్సాహం ఉంటుంది. – మనోహర్, ఏరియా జీఎం ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేయాలి! బంగారు పతకం సాధించడంలో సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం బాగుంది. పోటీలకు వెళ్లే ముందు ప్రత్యేకంగా మరికొంత సమయం ఇస్తే బాగుంటుంది. యాజమాన్యం మరింత సహకరించి ప్రోత్సహిస్తే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా. సింగరేణిలో యువ ఉద్యోగులు సుమారు 20 వేల మందికి పైగానే ఉన్నారు. ఫిట్నెస్ కోసం సింగరేణి వ్యాప్తంగా ప్రతీ ఏరియాలో జిమ్ ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన కోచ్‌లను నియమించాలి. యువ ఉద్యోగులు ప్రతీరోజు జిమ్‌కు వెళ్లడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు విధులకు గైర్హాజర్ కాకుండా హాజరై సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిలో పాలుపంచుకుంటారు. – వెంకటస్వామి, కోలిండియా గోల్డ్ మెడలిస్ట్ సాధించిన పతకాలు ప్రతీ సంవత్సరం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో సింగరేణిలో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2018–19, 2019–20, 2020–21, 2022–23 సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సింగరేణి తరఫున 2019లో మధ్యప్రదేశ్‌లోని సింగ్రోళిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం, 2020లో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన కోలిండియా పోటీల్లో కాంస్య పతకం, 2022లో పశ్చిమబెంగాల్లోని కోల్‌కత్తాలో నిర్వహించిన పోటీల్లో వెండి పతకం అందుకున్నాడు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించి దేశవ్యాప్తంగా మందమర్రి ఏరియాకు గుర్తింపు తెచ్చాడు. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీ బిజీగా ఉండే యువతకు వెంకటస్వామి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏదైనా సాధించాలనే తపన ఉంటే సాధనతో సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా తయారవుతారని నిరూపిస్తున్నాడు. ఇవి చదవండి: మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు? -
చేవెళ్ల కాంగ్రెస్ రెబెల్ కాళ్లు పట్టుకున్న రత్నం
-
ఉన్మాదికి ఉరిశిక్ష
► మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గుడు ► కరీంనగర్ జిల్లా అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ► చాక్లెట్లు కొనిస్తానంటూ బాలికను తీసుకెళ్లిన వెంకటస్వామి ► అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య ► ఆ దుష్టుడికి ఉరిశిక్షే సరైనదని నిర్ణయించిన న్యాయమూర్తి కరీంనగర్ క్రైం/కాటారం: అన్నెం పున్నెం ఎరుగని ఓ మూడున్నరేళ్ల చిన్నారిని కాటేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష పడింది. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై గొంతు నులిమి చంపేసిన ఈ మానవ మృగాన్ని మరణించే వరకూ ఉరి తీయాల్సిందిగా కరీంనగర్ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.జయశంకర్ జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన ఓ మూడున్నరేళ్ల బాలిక స్థానిక అంగన్వాడీ పాఠశాలలో చదివేది. 2016 ఫిబ్రవరి 27న సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న ఆ చిన్నారిని, ఆమె అక్కను.. వారి ఇంటి వెనకాలే నివాసముండే జక్కుల వెంకటస్వామి (30) పిలిచాడు. చాక్లెట్లు కొనిస్తానంటూ మభ్య పెట్టి.. వెంట ఉన్న అక్కను అక్కడి నుంచి పంపిం చేశాడు. తర్వాత చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి.. రాక్షసంగా అత్యాచారం చేశాడు. తర్వాత పాప గొంతు నులిమి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పారిపో యాడు. సాయంత్రం పొలం పనులు చేసుకొని ఇంటికి వచ్చిన తల్లికి చిన్న కుమార్తె కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మరుసటి రోజు ఉదయం పెద్ద కుమార్తెను వివరంగా అడగగా.. వెంకటస్వామి చాక్లెట్ కొనిస్తానంటూ తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు వెంకటస్వామి ఇంటి కిటికీలు తెరిచిచూశారు. లోపల ఓ మూలన కోళ్లను కమ్మే గంప పక్కన చిన్నారి బట్టలు కనిపించాయి. ఇంటి తాళం పగల గొట్టి, లోనికి వెళ్లి చూస్తే.. గంప కింద రక్తసిక్తమైన చిన్నారి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నా రిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఐపీసీ 302, 376, ఫోక్సా యాక్ట్ 6 కింద క్రైం నంబర్ 28/2016తో కేసు నమోదు చేశారు. మార్చి 5న జక్కుల వెంకటస్వా మిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు రిమాండ్‌లో ఉన్నాడు. కరీంనగర్‌లోని బాలికలపై అత్యాచారాల నిరోధక ప్రత్యేక జిల్లా కోర్టు ఈ కేసును.. పలు దఫాలుగా విచారించింది. 11 మంది సాక్ష్యం, ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి సురేశ్.. వెంకట స్వామిని దోషిగా నిర్ధారించారు. అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుంది ‘‘అల్లారుముద్దుగా పెంచుకున్న మా బిడ్డను ఆ దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు. నిత్యం మా బిడ్డ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితి మరే తల్లిదండ్రులకూ రావద్దు. దేవుడిని, చట్టాన్ని నమ్ముకున్నాం. వాడికి ఉరిశిక్ష పడింది, మా బిడ్డ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది..’’ – బాధిత చిన్నారి తల్లిదండ్రులు -
అడ్డుకునేవారికి బుద్ధి చెబుతాం
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేవారికి బుద్ధి చెబుతామని జాతీయ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోగల ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఎస్సీవర్గీకరణను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయన్నారు. ఎస్సీవర్గీకరణ ఆగదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాల అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం వచ్చేనెల 20న హైదరాబాద్‌లో ధర్మ యుద్ధం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చేనెల 3న సన్నాహక సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మాదిగ, రాష్ట్ర నాయకులు గంగాధర్, పోశెట్టి, యమున, తార, శ్రీనివాస్, తోబేవార్ సంతోష్, విఠల్, తిమప్ప, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాలి
జోనల్ వ్యవస్థ రద్దుకు నిపుణుల కమిటీని వేయాలి ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్ : ప్రజాస్వామిక తెలంగాణ సాధన ఉద్యమానికి అందరూ ఉద్యమించాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. ప్రెస్‌భవన్‌లో శుక్రవారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్నివర్గాల ప్రజలు ఉద్యమించారని, ఇందులో ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. అనేక ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి కొత్తదనం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులను కాపాడుకునేందుకే ఉద్యమం మొదలైందని, స్వరాష్ట్ర సాధనలో ఆయా రంగాలకు తీరని ద్రోహమే జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ లెక్చరర్లకు 12 మాసాల జీతభత్యాలు, ఉద్యోగభద్రత, ఆరోగ్యభద్రత, తదితర సౌకర్యాలను ప్రభుత్వ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. జోనల్ వ్యవస్థ రద్దుకు ముందు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో ఉపకులపతుల నియామకాలను యూజీసీ గైడ్‌లైన్స్ కు అనుకూలంగా జరిపి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన అధ్యాపక ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. సమావేశంలో టీఎల్ఎఫ్ అనుబంధ సంఘాల చైర్మన్ బండి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు గుర్రం అంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సత్యనారాయణరెడ్డి, ఎ.రవికుమార్, ఎ.దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కాకా ఫొటోలు టీఆర్ఎస్ మీటింగ్లోనా’
తుది వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న కాకా(వెంకటస్వామి) ఫొటోలను టీఆర్ఎస్ మీటింగుల్లో ఎలా పెట్టుకుంటారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. ఫిరాయింపులను కూడా టీఆర్ఎస్ పండుగ మాదిరిగా జరుపుకుంటోందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి లెసైన్స్ ఇచ్చేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్ మధ్య వారసత్వ పోరు అధికార పార్టీలో ఉన్నట్లుందని పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌ను సమర్ధించుతున్నట్లు కనిపిస్తోందని మల్లు రవి చెప్పారు. -
పిల్లలపై రౌడీషీటర్ ప్రతాపం
హైదరాబాద్: ఓ రౌడీషీటర్ తన ప్రతాపాన్ని చిన్నపిల్లల మీద చూపించాడు. చెప్పినపని చేయలేదని ఐదుగురు అబ్బాయిలను గదిలో నిర్బంధించి ప్లాస్టిక్ పైపుతో చితకబాదాడు. వాతలు రేగేలా చావగొట్టాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. తుకారంగేట్ సమీపంలో ఉంటున్న రౌడీషీటర్ వెంకటస్వామి, అతని కటుంబం.. తమ పిల్లలను హింసించారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల ఒంటిపై గాయాలు చూసి చలించిన పోలీసులు... 24గంటల్లోనే రౌడీషీటర్ వెంకటస్వామితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గాయపడ్డ ఐదుగురు పిల్లలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలపై రౌడీషీటర్ ప్రతాపం
-
నెక్లెస్‌రోడ్డులో వెంకటస్వామి స్మారకం
హెచ్ఎండీఏను ఆదేశించిన సీఎం కేసీఆర్‌తో మాజీ ఎంపీ వివేక్ భేటీ సాక్షి,హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామిని భావితరాలు స్మరించుకునేలా రాజధానిలో స్మారక నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆయన దేశానికి సేవచేసిన దళిత నాయకుడిగా, పేదల కోసం జీవించిన ఉన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం అన్నారు. ఆయన గౌరవాన్ని పెంచే విధంగా స్మారకాన్ని నిర్మిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కలిసిన సందర్భంగా ఈ అంశంపై అధికారులతో సీఎం మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డులో స్థలం సేకరించాలని, సభలు నిర్వహించుకోడానికి వీలుగా నిర్మాణం ఉండాలని, అందులో వెంకటస్వామి విగ్రహం కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించారు. వచ్చే జయంతిని ఇందులోనే నిర్వహించేలా త్వరగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ కూడా దళితుల కోసం ఎంతో పాటుపడ్డారని, ఆయన చరిత్ర కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంకటస్వామి విషయంలో అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. టీఆర్ఎస్లో చేరిక ఊహాగానాలే: వివేక్ టీఆర్ఎస్లో చేరి వరంగల్ ఎంపీ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే టీఆర్ఎస్లో చేరతారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా ముందుకుసాగారు. -
‘కాకా’ స్మారకచిహ్నం నెలకొల్పాలి
కాంగ్రెస్ నేతల డిమాండ్ గాంధీభవన్‌లో వెంకటస్వామి సంస్మరణ సభ కాకలు తీరిన వారికే ‘కాకా’ అని కొనియాడిన నేతలు సాక్షి, హైదరాబాద్: కాకలు తీరిన రాజకీయ నేతలకూ ‘కాకా’గా కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కొనియాడారు. దివంగత నాయకుడు వెంకటస్వామి పేరుతో స్మారకచిహ్నం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన వెంకటస్వామి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పార్టీ అగ్రనేతలు జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, నంది ఎల్లయ్య, షబ్బీర్ అలీ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, మల్లు భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్, మాదు సత్యం, కత్తి వెంకటస్వామి, మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి అసామాన్య స్థాయికి ఎదిగిన దళితజాతి రత్నంగా వారు అభివర్ణించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాకా పేరు పెట్టాలని, కాకా పేరుతో ఆడిటోరియం నిర్మించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడబోయే వాటిలో ఓ జిల్లా కు కాకా పేరు పెట్టాలని కోరారు. త్రివేణి సంగమంలో అస్థికలు నిమజ్జనం కాటారం: జి.వెంకటస్వామి అస్థికలను శనివారం ఆయన కుమారులు కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. కాకా కుమారులు మాజీ మంత్రి వినోద్, మాజీ ఎంపీ వివేక్‌లు కుటుంబ సభ్యులతో ఉదయం కాళేశ్వరం వచ్చారు. గోదావరి వద్ద ప్రత్యేక పూజలు చేసి, మూడు నదులు కలిసే చోట అస్థికలను నిమజ్జనం చేశారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి కన్నుమూత
-
అడ్డుగా ఉన్నాడనే అంతం
వికారాబాద్: వ్యక్తి హత్య మిస్టరీని వికారాబాద్ పోలీసులు ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని ఏసీఆర్ జూబ్లీకాలనీలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి కేసు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్కు చెందిన ఇబ్రహీంఅలీ, ఫరీదాబేగం దంపతులు. ఇబ్రహీంఅలీ కూలీపనులు చేస్తుండగా భార్య స్థానిక మహావీర్ అస్పత్రిలో వంట మనిషి. కొంతకాలంగా ఇబ్రహీంఅలీ మద్యానికి బానిసయ్యాడు. శివారెడ్డిపేటకు చెందిన ఆయన పెద్దఅక్క కొడుకు జమీల్‌తో ఫరీదాబేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కారు డ్రైవర్ అయిన జమీల్ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అప్పుడప్పుడు స్వస్థలానికి వస్తూ తమ ‘సంబంధా’న్ని కొనసాగిస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంఅలీ పలుమార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కుంగిపోయాడు. ఎప్పటికైనా ఇబ్రహీంఅలీ తమకు అడ్డుగా ఉన్నాడని, ఆయనను ఎలాగైనా హత్య చేయాలని ఫరీదాబేగం పథకం పన్ని ప్రియుడు జమీల్‌కు చెప్పింది. ఈ నేపథ్యంలో జమీల్ వికారాబాద్‌లోని కొత్తగంజ్‌లో ఉంటున్న తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని యూసుఫ్‌ను ఫోన్లో సంప్రదించాడు. ఎలాగైనా ఇబ్రహీంఅలీని చంపేయాలని కోరాడు. చంపడం తనతో కాదని.. తన హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న అశుకు డబ్బులు ఇస్తే ఆ పని చేస్తాడని యూసుఫ్ చెప్పాడు. దీంతో సుపారీ రూ.2 లక్షలకు కుదిరింది. యూసుఫ్ ఖాతాలో జమీల్ రూ.29,500లను వేశా డు. మిగతా డబ్బు పని పూర్తయ్యాక ఇస్తానని చెప్పాడు. దీంతో అశు, ఇబ్రహీంఅలీతో కలిసి ఈ నెల 1న రాత్రి ఏసీఆర్ జూబ్లీకాలనీలో మద్యం తాగాడు. పథకం ప్రకారం అశు ఇబ్రహీంఅలీకి ఎక్కువగా మద్యం తాగించాడు. అనంతరం బీరు బాటిల్ పగులగొట్టిన అశు లేవలేని స్థితిలో ఉన్న ఇబ్రహీంఅలీ గొంతు కోసి హత్యచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫరీదాబేగం, జమీల్ల ఫోన్‌కాల్‌లపై దృష్టి సారించారు. ఈమేరకు ఫరీదాబేగంను అదుపులోకి తీసుకొని విచారించగా పైవివరాలు తెలిపింది. ఈమేరకు పోలీసులు యూసుఫ్, అశులను అరెస్టు చేసి సోమవారం ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో సీఐ రవి,ఎస్ఐ శేఖర్లతో పాటు ఐడీ పార్టీ పోలీసులు రమేష్, బాలు ఉన్నారు. -
తెలంగాణ రాజకీయ భీష్ముడు
1949లో జరిగిన నాసిక్ కాంగ్రెస్ సమావేశాలు ఎంతో కీలకమైనవి. ఈ సమావేశాల కోసం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 18 మంది ప్రతినిధులను ఎంపిక చేసింది. వారిలో వెంకటస్వామి కూడా ఉన్నారు. అనుభవం వెలకట్టలేని సంపద. వ్యవస్థ సరిగా సాగేందుకు అలాంటి అనుభవ జ్ఞుల మాటలు చద్దన్నపు మూటల మాదిరిగా ఉపకరిస్తాయి. తెలంగాణలో కనిపించే నాయకులలో జి. వెంకటస్వామి అలాంటి అనుభవశాలి. అణగారిన వర్గాల కోసం ఆయన సాగించిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ప్రభుత్వం వెలుపల ఉన్నపుడు వెంకటస్వామి సమర్థంగా ఉద్యమాలు నిర్వహించారు. పదవులలో ఉంటే పాలనా దక్షతను చూపారు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాల ఆధునిక తెలంగాణ రాజకీయ చరిత్రకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం స్వప్నిం చారు. ఆ స్వప్నం ఆయన కళ్ల ముందే ఫలించింది. ఆర్యసమాజంతో స్ఫూర్తి వెంకటస్వామి అసలుసిసలు హైదరాబాదీ. ఆయన తండ్రి తోప్‌ఖానా ప్రాంతంలో చిన్న మేస్త్రి. నిజాం ప్రభుత్వం కోసం మందుగుండును తయారు చేసే ప్రాంతాన్నే తోప్‌ఖానా అనే వారు. వెంకటస్వామి జీవితం వడ్డించిన విస్తరి కాదు. వారిది సాదాసీదా కుటుంబం. వెంకటస్వామి ప్రాథమిక విద్య లాల్‌దర్వాజా ప్రాంతంలోని ఆర్య సమాజ పాఠశాలలో జరి గింది. ఆర్య సమాజం ప్రభావమే ఆయన మీద ఎక్కువ. ప్రాథ మిక విద్య తరువాత అనివార్యంగా ఉర్దూ మీడియంలోనే కొన సాగవలసి వచ్చింది. అందుకోసం ఆయన పస్తానియా ఉర్దూ పాఠశాలలో చేరారు. ఆనాటి నేపథ్యమే వేరు. ఒకవైపు ఆర్య సమాజం పోరాటాలు, పునాదులు వేసుకుంటున్న స్టేట్ కాంగ్రెస్, అజ్ఞాతంగా విప్లవాన్ని నిర్మిస్తున్న కమ్యూనిస్టులు చురుకుగా ఉండేవారు. మరోవైపు రజాకార్ల విజృంభణ. వెంకటస్వామి తొలి నుంచి తెలంగాణ వాది. 1953లో ప్రథమ ప్రధాని నెహ్రూ హైదరాబాద్ వచ్చినపుడు పలువురితో కలసి ‘జై తెలంగాణ’ అని నినదించారు. అప్పటికి ఆయన వయసు పదహారేళ్లు. నిజానికి ఆనాడు కాంగ్రెస్ సంస్థకు బాహాటంగా పనిచేసే అవకాశం లేదు. అంతా అజ్ఞాత పోరా టమే. ఆ సంస్థలో చేరిన వెంకటస్వామి జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ పార్టీలోనే కొనసాగారు. హైదరాబాద్ రాష్ట్రంలో పిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి అయ్యారు. స్వామి రామానందతీర్థ, మాడపాటి రామచం ద్రరావు వంటివారితో సన్నిహితంగా మెలిగారు. 1949లో జరిగిన నాసిక్ కాంగ్రెస్ సమావేశాలు ఎంతో కీలకమైనవి. ఈ సమావేశాల కోసం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 18 మంది ప్రతినిధులను ఎంపిక చేసింది. వారిలో వెంకటస్వామి కూడా ఉన్నారు. తరువాత హైదరాబాద్‌లోనే నానల్ నగర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో కీలకపాత్ర పోషించగలిగారు. కార్మిక నాయకత్వం హైదరాబాద్ సంస్థానంలో తొలిదశ కార్మికోద్యమ నేతలలో వెంకటస్వామి ఒకరు. ఆయన కార్మిక నేతగా ఆవిర్భవించిన తీరు ప్రత్యేకమైనది. 1949లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూని యన్ (ఐఎన్టీయూసీ) సర్దార్ పటేల్ చేతుల మీదుగా ఆరం భమైంది. ప్రాంత స్థాయిలో ఆ సంస్థకు వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. కొద్దికాలంలోనే 102 సంస్థ లకు ఆయన నాయకుడయ్యారు. దాదాపు 50 కార్మిక సంఘా లను నెలకొల్పారు. జాతీయ స్థాయి గుడిసె వాసుల సంఘం వెంకటస్వామి ఆధ్వర్యంలోనే ఏర్పడింది. ఇవన్నీ ఆయనను మాస్ లీడర్‌గా నిలిపాయి. 1982 రాష్ట్ర రాజకీయ చరిత్ర ఒక మలుపు తీసుకున్నపుడు పీసీసీ నేతగా వెంకటస్వామి వ్యవహరించారు. ఆ సంవత్సరమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తుపాను వేగంతో రాష్ట్రంలో పర్యటించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమం త్రిగా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ముఖ్యమంత్రితో వెంకటస్వామి మంచి సమన్వయం సాధించగలిగారు. ఆ ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పలేదు. కానీ తెలంగా ణలో టీడీపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలిగింది. వెంకటస్వామి కొద్దికాలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉండి, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములయ్యారు. సీతా రాం కేసరి తరువాత (1996)లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం కొద్దిలో తప్పింది. విజయాలే ఎక్కువ వెంకటస్వామి జీవితంలో విజయాలే ఎక్కువ. 1957లో తొలి సారి శాసనసభకు ఎన్నికైన వెంకటస్వామి, ఏడుసార్లు లోక్ సభకు కూడా ఎంపికయ్యారు. జాతీయ రాజకీయాలలో వెంక టస్వామి ఇందిరను బలపరిచారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇందిరపై విమర్శలు వెల్లువెత్తాయి. 1978లో కాంగ్రెస్ చీలిపోయింది. ఆ సమయంలో కూడా వెంక టస్వామి ఇందిర పట్లనే విధేయునిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ విషయంలో కూడా ఆయన ఇదే రీతిలో మద్దతు తెలిపారు. నిజానికి ఇంత సుదీర్ఘ, విశిష్ట రాజకీయ జీవితం ఉన్నప్పటికీ ఆయన మంత్రి పదవిలో కొనసాగిన కాలం తక్కువే. 1978లో రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి సిద్ధిపేట లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రిమండలిలో చెన్నారెడ్డి చోటు కల్పించారు. ఇది అరు దైన ఘటన. వెంకటస్వామి పాలనా సామర్థ్యానికి నిదర్శనం. తరువాత విధాన మండలికి ఎన్నికయ్యారు. కేంద్రంలో పీవీ నరసింహారావు మంత్రివర్గం ఏర్పడినపుడు కూడా వెంకట స్వామికి చోటు దక్కింది. పీవీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. రాజకీయ భీష్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం వెంకటస్వామి మీద గాఢంగా ఉంది. అణగారిన వర్గాల వారు అభ్యుదయ పథంలో నడవాలంటే వారికి విద్య అవసరమని ఆయన నమ్మా రు. అణగారిన వారికి విద్యను అందించేందుకు వెంకటస్వామి 1973లో బీఆర్ అంబేద్కర్ పేరుతో ఒక విద్యా సంస్థను హైదరాబాద్‌లో స్థాపించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలం నాటి రాజకీయ వ్యూహాలన్నీ తెలిసిన అతికొద్దిమందిలో వెంకటస్వామి ఒకరు. ఇలాంటివారు నేటి రాజకీయ రంగంలో అరుదు. అందుకే ఆయనను తెలంగాణ రాజకీయ భీష్మునిగా అభివర్ణించవచ్చు. ప్రొ. ఆర్. లింబాద్రి ప్రొ. జి. కృష్ణారెడ్డి (ఉస్మానియా విశ్వవిద్యాలయం) -
దళితులపై కాంగ్రెస్ వివక్ష
చేవెళ్ల రూరల్: కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దళితుల పట్ల వివక్షత చూపిస్తోందని. తనను పదవి నుంచి నెల కాలంలో రెండు సార్లు తొలగించటాన్ని బట్టే ఇది తెలుస్తోందని తాజామాజీ డీసీసీ అధ్యక్షుడు పి. వెంకటస్వామి అన్నారు. ‘జిల్లా డీసీసీ అధ్యక్షుడి మార్పు, క్యామ మల్లేశ్ నియమాకం’ అని మీడియాలో వార్తలు రావటం చూసిన ఆయన చేవెళ్లలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోన్నాల లక్ష్మయ్య దళితులపట్ల చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఎందుకు పదవిని కట్టబెట్టారు.... ఎందుకు తొలగిస్తున్నారో కనీసం సమాచారం ఇవ్వకుండా వారికిఇష్టం వచ్చిన వారికి పదవిని కట్టబెట్టటం ఎంతవరకు సమంజసం అన్నారు. ఒక దళితునిగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంటే తనను తప్పించి క్యామ మల్లేశ్‌ని తిరిగి నియమించటం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితుడినని, డబ్బులు లేవనే తనను ఇలా తొలగించి డబ్బులు ముట్ట జెప్పిన మల్లేశ్‌కు డీసీసీ పదవీని ఇచ్చినట్లు ఆరోపించారు. ఇది దళితులకు పార్టీ చేస్తున్న అన్యాయమేనన్నారు. పార్టీకోసం గత 30ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నాటినుంచి కేంద్ర కాంగ్రెస్‌పార్టీ దళితులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చిందని, ఈనాడు సోనియా గాంధీకూడా దళితులకు న్యాయం చేస్తుంటే రాష్ట్ర నాయకులు దీనిని దిగజారుస్తున్నారన్నారు. తనకు అన్యాయం చేసిన పీపీసీ అధ్యక్షుడు దళితుల వద్దకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని, పార్టీ మారకూడదని బుజ్జగించి డీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చిన పొన్నల లక్ష్మయ్యే ఇప్పుడు తనను ఆ పదవి నుంచి ఎందుకు తప్పిస్తున్నారో చెప్పాలన్నారు. ఏప్రిల్ 17న డీసీసీ పదవిని ఇచ్చి ఆగస్టు 22న తనన మార్చి మళ్లీ క్యామ మల్లేశ్‌కు ఇచ్చినట్లు వార్తలు వస్తే వెంటనే అప్పుడు నాయకులు కలుగ జేసుకొని మేథోమథన సదస్సు ఉందని దానిని అప్పటివరకు నిలిపి వేశారు. మళ్లీ నెల రోజులు గడిచిన వెంటనే మళ్లీ అధ్యక్షుడి మార్పు చేయటం సిగ్గు చేటు అన్నారు. దీన్ని గురిం చి మాజీ హోం మంత్రి సబితారెడ్డికి ఫొన్‌చేసి అడిగితే టీపీసీసీతో మాట్లాడుతానని చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీలో రౌడీలు, గుండాలు, డబ్బులు ఉన్నవారిదే రాజ కీయం నడుస్తోందన్నారు. తాను ప్రజల మనిషిగా ఉం టానని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉం డాలని నిర్ణయించుకుంటున్న ట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. -
సొంత గూటికి వలస పక్షులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశాక, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న వెంకటస్వామి(కాకా) తనయులు ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తనతోపాటే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. ఐకే రెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఆయ న టీఆర్ఎస్లో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ ఎట్టకేలకు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి తనయులు పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ కూడా సొంత గూటికి చేరుకోవడంతో ఆయన వర్గీయులు కూడా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నారు. కొంత కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కాం గ్రెస్ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కొంత కాలంగా తటస్థంగా ఉన్నారు. ఐకే రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో కోనప్ప కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హస్తంలో ఇక టిక్కెట్ల రాజకీయం ఈ నలుగురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్‌లో టిక్కెట్ల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగనున్నాయి. ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానంలో పోటీ చేయాలని భావిస్తుండటంతో అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న వారి ఆశలకు గండిపడే అవకాశం ఉంది. సిర్పూర్లో కోనేరు కోనప్ప తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండటంతో అక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారితో ఉత్కంఠ మొదలైంది. టిక్కెట్ విషయంలో అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే ఐకే రెడ్డి ఢిల్లీలో సోమవారం ఉగాది రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ స్థానం నుంచి బరిలో దిగుతారనే అంశంపై ఒకటీ రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. నిర్మల్ ‘సిట్టింగ్’ పదిలమేనా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ పంపిన జాబితాలో సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యే ఒక్కరి పేరే ప్రతిపాదించింది. కొత్తగా పనితీరు అంశం తెరపైకి రావడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆందోళనలో పడ్డారు. పనితీరు బాగాలేని చోట్ల ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలోకి దించుతామని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది. కాగా మహేశ్వర్‌రెడ్డి పనితీరుపై నిర్మల్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు. మహేశ్వర్‌రెడ్డిని నిర్మల్ నుంచి కాకుండా, ప్రత్యామ్నాయ స్థానం నుంచి బరిలోకి దించితే ఈ అసంతృప్తిని అధిగమించ వచ్చనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్ ‘సీటు’కు తీవ్ర పోటీ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా కాంగ్రెస్‌లో చేరుతారని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. కోనప్ప ఐకే రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇప్పుడు సిర్పూర్ తెరపైకి కోనప్ప రాకతో ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పోటీ మరింత పెరగనుంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఏఐసీసీ సభ్యులు సుల్తాన్ అహ్మద్, ఏపీపీఎస్పీ సభ్యుడు పి.రవీందర్రావు తదితరులు టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇప్పుడు కోనప్ప రాకతో టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్న వారి సంఖ్య మరింత పెరిగినట్లయింది. చెన్నూర్ ఆశావహులపై వినోద్ నీళ్లు టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి జి.వినోద్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ఆయన చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నెలకొంది. మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన చెన్నూరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. వినోద్ టీఆర్ఎస్లోకి వెళ్లడంతో చెన్నూరులో బలమైన నేతలెవరూ తెరపైకి రాలేదు. సొత్కు సంజీవరావు, డి.శ్రీనివాస్, ఎం.సంపత్, వినయ్ తదితరులు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. ఇప్పుడు వినోద్ రాకతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్లో కొనసాగిన ఎంపీ వివేక్ ఇప్పుడు మళ్లీ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కల్యాణ వైభోగమే..
నక్కపల్లి, న్యూస్‌లైన్: కల్యాణ కాంతులతో ఉపమాక కళకళలాడింది. కోనేటిరాయుని పరిణయోత్సవం ఉపమాకకు వినూత్న అందాలను తీసుకువచ్చింది. ప్రసిద్ధి గాంచిన ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణం గురువారం తెల్లవారుజామున కనుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణం ఘట్టాన్ని తనివితీరా చూసి పులకించిపోయారు. ఉపమాకకు చెందిన సింహాద్రాచార్యుల ఇంటి వద్ద స్వర్ణాలంకరణ భూషితుడైన వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, పట్టువస్త్రాలు బంగారు ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి, భూదేవిని సప్పరవాహనంపైన ఉంచి పెళ్లి మాటల తంతును నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాద్రాచార్యుల కుటుంబీకులు స్వామివారికి పసుపు కుంకుమలు, పండ్లు, పట్టు వస్త్రాలు, తాం బూలం సమర్పించారు. అనంతరం చిన్నరథంపై తిరువీధిసేవ నిర్వహించారు. తదుపరి స్వామివారి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భద్రాచలంకు చెందిన రామాయణం శర్మ, తెలుగు పండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీ దేవి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఈవోలు శేఖర్‌బాబు, రంగనాథస్వామి, వెంకటాద్రి, పాలకమండలి సభ్యులు బుజ్జి, సింహాద్రి, శ్రీను, చిరంజీవి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు మణిరాజు, శివాలయం మాజీ చైర్మన్లు సిద్దాబత్తుల జోగారావు, కొండబాబు పాల్గొన్నారు. కల్యాణోత్సవాల సందర్భంగా వెంకన్నకు అలంకరించేందుకు విశాఖలోని ట్రెజరీ నుంచి తీసుకొచ్చిన బంగారు ఆభరణాలను గురువారం తిరిగి పంపించేశారు. -
హైదరాబాద్‌పై కొర్రీ పెడితే కాంగ్రెస్ పాతరే!
జహీరాబాద్ టౌన్,న్యూస్‌లైన్: కేంద్రప్రభుత్వం సీమాంధ్ర నేతల వత్తిడికి తలొగ్గి హైదరాబాద్‌పై కొర్రీపెడితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను పాతరేయడం ఖాయమని టీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కత్తి వెంకటస్వామి హెచ్చరించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జరుగనున్న సకల జనభేరికి మద్దతుగా బుధవారం జహీరాబాద్‌లో టీజేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు రాంచందర్ భీంవంశీ, బస్వరాజ్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. టీజేఏసీ కన్వీనర్ మొగుడంపల్లి ఆశప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సభలో కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అనేక పోరాటాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటన వచ్చిందన్నారు. అయితే హైదరాబాద్‌పై ఎవరిష్టమొచ్చినట్లు వారు మాట్లాడడంతో అయోమయం నెలకొందన్నారు. హైదరాబాద్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందన్నారు. హైదరాబాద్‌పై పేచీ పెడితే ఇక్కడి ప్రజలు తిరగబడతారన్నారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ వస్తే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కుతాయన్నారు. టీ జేఏసీ పశ్చిమ కమిటీ చెర్మైన్ ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓలు నిర్వహించిన సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే జై తెలంగాణ అంటే సహించలేనివారు 4 కోట్ల ప్రజలను ఎలా సహిస్తారన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటుచేయాలని, అప్పటివరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ ఆధికారంలోకి రాగానే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గౌని శివకుమార్,మల్లికార్జున్ పాటిల్, టీజేఏసీ నేతలు రవికిరణ్, ఆశోక్‌రెడ్డి, సామెల్, జబ్బార్, శ్రీకాంత్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నామ రవికిరణ్ గుప్తా, టీఎల్ఎఫ్ నేతలు పాండురంగం,సిద్దన్న సిద్దారెడ్డి,సురేందర్, మాలమహానాడు రాష్ట్ర నేత ఇస్మాలప్ప, టీఆర్ఎస్ నేతలు యాకూబ్, బండి మోహన్,రాకేష్, కలీం, బీజేపీ నేతలు బస్వరాజ్ పాటిల్, శ్రీనివాస్‌గౌడ్, చెంగల్ రాజశేఖర్,సుధీర్ బండారీ,రాజ్‌కుమార్ దేశ్‌పాండే, వివిధ సంఘాల నాయకలు నూరుల్ హసన్ ఘోరీ,రాములు నేత, కెవీఆర్ రెడ్డి, వరాలు, కిష్టయ్య, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రాజు పాల్గొన్నారు.