
పిల్లలపై రౌడీషీటర్ ప్రతాపం
హైదరాబాద్: ఓ రౌడీషీటర్ తన ప్రతాపాన్ని చిన్నపిల్లల మీద చూపించాడు. చెప్పినపని చేయలేదని ఐదుగురు అబ్బాయిలను గదిలో నిర్బంధించి ప్లాస్టిక్ పైపుతో చితకబాదాడు. వాతలు రేగేలా చావగొట్టాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో జరిగింది. తుకారంగేట్ సమీపంలో ఉంటున్న రౌడీషీటర్ వెంకటస్వామి, అతని కటుంబం.. తమ పిల్లలను హింసించారంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పిల్లల ఒంటిపై గాయాలు చూసి చలించిన పోలీసులు... 24గంటల్లోనే రౌడీషీటర్ వెంకటస్వామితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. గాయపడ్డ ఐదుగురు పిల్లలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.