ఇద్దరు చిన్నారులపై కుక్క దాడి
Published Sun, Dec 18 2016 10:48 PM | Last Updated on Sat, Sep 29 2018 3:55 PM
కోరుకొండ :
ఊర కుక్క స్వైరవిహారం చేసి మండల కేంద్రమైన కోరుకొండలో ఆదివారం ఇద్దరు చిన్నారులను తీవ్రంగా గాయపరిచింది. స్థానిక రామకృష్ణ« సినిమా హాల్ సమీపంలో తమ ఇళ్ల వద్ద గుమ్మంలో నిలబడిన చిన్నారులపై ఈ కుక్క దాడి చేసింది. కుక్క అరుపులకు పిల్లలు, పెద్దలు భయపడి పరుగులు తీశారు. రాజమహేంద్రవరంలోని మోరంపూడికి చెందిన లంకా రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కోరుకొండలో ఉంటున్న తన సోదరుడైన లంకా మోహ¯ŒSబాలు ఇంటికి వచ్చారు. రాజేష్ కుమారుడు మూడేళ్ల లక్కి ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉండగా, కుక్క పరుగున వచ్చి అతడి తలపై, వీపు వెనుక గాయపరిచింది. బాలుడి అరుపులకు ఇంటిలో నుంచి బయటకు వచ్చిన కుటుంబ సభ్యులునా కుక్కను తరిమివేశారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకువెళ్లారు. అదే వీధిలో ఉంటున్న కర్రి బాబ్జీ, చిన్నారి దంపతుల కుమార్తె ఏడేళ్ల కర్రి లిఖితేశ్వరి వీపుపైనా కుక్క గాయపరిచింది. ఆమెకు కోరుకొండ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
Advertisement
Advertisement