ఆత్మకూర్ (ఎస్) :
కుక్క దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మల్లన్నమర్రి వీధికి చెందిన మండాది మల్లమ్మతో పాటు రెండో తరగతి చదవుతున్న బుడిగె శిరీషను గాయపర్చింది. అంతకు ముందు రోజు అదే వీధికి చెందిన లింగయ్యను గాయపర్చి తప్పించుకుని పక్కనే గల పత్తి చేనులో నక్కింది. మళ్లీ రాత్రి సమయంలో వీధిలోకి వచ్చి ఇంట్లోనే నిద్రిస్తున్న మండాది మల్లమ్మపై దాడిచేసింది. అధికారులు స్పందించి వెంటనే కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కుక్కదాడిలో ఇద్దరికి గాయాలు
Published Sun, Sep 25 2016 11:34 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement