
తెలంగాణ రాజకీయ భీష్ముడు
1949లో జరిగిన నాసిక్ కాంగ్రెస్ సమావేశాలు ఎంతో కీలకమైనవి. ఈ సమావేశాల కోసం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 18 మంది ప్రతినిధులను ఎంపిక చేసింది. వారిలో వెంకటస్వామి కూడా ఉన్నారు.
అనుభవం వెలకట్టలేని సంపద. వ్యవస్థ సరిగా సాగేందుకు అలాంటి అనుభవ జ్ఞుల మాటలు చద్దన్నపు మూటల మాదిరిగా ఉపకరిస్తాయి. తెలంగాణలో కనిపించే నాయకులలో జి. వెంకటస్వామి అలాంటి అనుభవశాలి. అణగారిన వర్గాల కోసం ఆయన సాగించిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ప్రభుత్వం వెలుపల ఉన్నపుడు వెంకటస్వామి సమర్థంగా ఉద్యమాలు నిర్వహించారు. పదవులలో ఉంటే పాలనా దక్షతను చూపారు. దాదాపు ఏడెనిమిది దశాబ్దాల ఆధునిక తెలంగాణ రాజకీయ చరిత్రకు ఆయన నిలువెత్తు సాక్ష్యం. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం స్వప్నిం చారు. ఆ స్వప్నం ఆయన కళ్ల ముందే ఫలించింది.
ఆర్యసమాజంతో స్ఫూర్తి
వెంకటస్వామి అసలుసిసలు హైదరాబాదీ. ఆయన తండ్రి తోప్‌ఖానా ప్రాంతంలో చిన్న మేస్త్రి. నిజాం ప్రభుత్వం కోసం మందుగుండును తయారు చేసే ప్రాంతాన్నే తోప్‌ఖానా అనే వారు. వెంకటస్వామి జీవితం వడ్డించిన విస్తరి కాదు. వారిది సాదాసీదా కుటుంబం. వెంకటస్వామి ప్రాథమిక విద్య లాల్‌దర్వాజా ప్రాంతంలోని ఆర్య సమాజ పాఠశాలలో జరి గింది. ఆర్య సమాజం ప్రభావమే ఆయన మీద ఎక్కువ. ప్రాథ మిక విద్య తరువాత అనివార్యంగా ఉర్దూ మీడియంలోనే కొన సాగవలసి వచ్చింది. అందుకోసం ఆయన పస్తానియా ఉర్దూ పాఠశాలలో చేరారు. ఆనాటి నేపథ్యమే వేరు. ఒకవైపు ఆర్య సమాజం పోరాటాలు, పునాదులు వేసుకుంటున్న స్టేట్ కాంగ్రెస్, అజ్ఞాతంగా విప్లవాన్ని నిర్మిస్తున్న కమ్యూనిస్టులు చురుకుగా ఉండేవారు. మరోవైపు రజాకార్ల విజృంభణ.
వెంకటస్వామి తొలి నుంచి తెలంగాణ వాది. 1953లో ప్రథమ ప్రధాని నెహ్రూ హైదరాబాద్ వచ్చినపుడు పలువురితో కలసి ‘జై తెలంగాణ’ అని నినదించారు. అప్పటికి ఆయన వయసు పదహారేళ్లు. నిజానికి ఆనాడు కాంగ్రెస్ సంస్థకు బాహాటంగా పనిచేసే అవకాశం లేదు. అంతా అజ్ఞాత పోరా టమే. ఆ సంస్థలో చేరిన వెంకటస్వామి జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ పార్టీలోనే కొనసాగారు. హైదరాబాద్ రాష్ట్రంలో పిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి అయ్యారు. స్వామి రామానందతీర్థ, మాడపాటి రామచం ద్రరావు వంటివారితో సన్నిహితంగా మెలిగారు. 1949లో జరిగిన నాసిక్ కాంగ్రెస్ సమావేశాలు ఎంతో కీలకమైనవి. ఈ సమావేశాల కోసం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 18 మంది ప్రతినిధులను ఎంపిక చేసింది. వారిలో వెంకటస్వామి కూడా ఉన్నారు. తరువాత హైదరాబాద్‌లోనే నానల్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో కీలకపాత్ర పోషించగలిగారు.
కార్మిక నాయకత్వం
హైదరాబాద్ సంస్థానంలో తొలిదశ కార్మికోద్యమ నేతలలో వెంకటస్వామి ఒకరు. ఆయన కార్మిక నేతగా ఆవిర్భవించిన తీరు ప్రత్యేకమైనది. 1949లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూని యన్ (ఐఎన్‌టీయూసీ) సర్దార్ పటేల్ చేతుల మీదుగా ఆరం భమైంది. ప్రాంత స్థాయిలో ఆ సంస్థకు వెంకటస్వామి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. కొద్దికాలంలోనే 102 సంస్థ లకు ఆయన నాయకుడయ్యారు. దాదాపు 50 కార్మిక సంఘా లను నెలకొల్పారు. జాతీయ స్థాయి గుడిసె వాసుల సంఘం వెంకటస్వామి ఆధ్వర్యంలోనే ఏర్పడింది. ఇవన్నీ ఆయనను మాస్ లీడర్‌గా నిలిపాయి.
1982 రాష్ట్ర రాజకీయ చరిత్ర ఒక మలుపు తీసుకున్నపుడు పీసీసీ నేతగా వెంకటస్వామి వ్యవహరించారు. ఆ సంవత్సరమే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తుపాను వేగంతో రాష్ట్రంలో పర్యటించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమం త్రిగా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ముఖ్యమంత్రితో వెంకటస్వామి మంచి సమన్వయం సాధించగలిగారు. ఆ ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పలేదు. కానీ తెలంగా ణలో టీడీపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వగలిగింది. వెంకటస్వామి కొద్దికాలం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉండి, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములయ్యారు. సీతా రాం కేసరి తరువాత (1996)లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం కొద్దిలో తప్పింది.
విజయాలే ఎక్కువ
వెంకటస్వామి జీవితంలో విజయాలే ఎక్కువ. 1957లో తొలి సారి శాసనసభకు ఎన్నికైన వెంకటస్వామి, ఏడుసార్లు లోక్ సభకు కూడా ఎంపికయ్యారు. జాతీయ రాజకీయాలలో వెంక టస్వామి ఇందిరను బలపరిచారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇందిరపై విమర్శలు వెల్లువెత్తాయి. 1978లో కాంగ్రెస్ చీలిపోయింది. ఆ సమయంలో కూడా వెంక టస్వామి ఇందిర పట్లనే విధేయునిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ విషయంలో కూడా ఆయన ఇదే రీతిలో మద్దతు తెలిపారు. నిజానికి ఇంత సుదీర్ఘ, విశిష్ట రాజకీయ జీవితం ఉన్నప్పటికీ ఆయన మంత్రి పదవిలో కొనసాగిన కాలం తక్కువే. 1978లో రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి సిద్ధిపేట లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రిమండలిలో చెన్నారెడ్డి చోటు కల్పించారు. ఇది అరు దైన ఘటన. వెంకటస్వామి పాలనా సామర్థ్యానికి నిదర్శనం. తరువాత విధాన మండలికి ఎన్నికయ్యారు. కేంద్రంలో పీవీ నరసింహారావు మంత్రివర్గం ఏర్పడినపుడు కూడా వెంకట స్వామికి చోటు దక్కింది. పీవీ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు.
రాజకీయ భీష్ముడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం వెంకటస్వామి మీద గాఢంగా ఉంది. అణగారిన వర్గాల వారు అభ్యుదయ పథంలో నడవాలంటే వారికి విద్య అవసరమని ఆయన నమ్మా రు. అణగారిన వారికి విద్యను అందించేందుకు వెంకటస్వామి 1973లో బీఆర్ అంబేద్కర్ పేరుతో ఒక విద్యా సంస్థను హైదరాబాద్‌లో స్థాపించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ కాలం నాటి రాజకీయ వ్యూహాలన్నీ తెలిసిన అతికొద్దిమందిలో వెంకటస్వామి ఒకరు. ఇలాంటివారు నేటి రాజకీయ రంగంలో అరుదు. అందుకే ఆయనను తెలంగాణ రాజకీయ భీష్మునిగా అభివర్ణించవచ్చు.
ప్రొ. ఆర్. లింబాద్రి ప్రొ. జి. కృష్ణారెడ్డి
(ఉస్మానియా విశ్వవిద్యాలయం)